India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ వెస్ట్ కూటమి టికెట్‌పై వివాదం ముదురుతోంది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో జనసేన టికెట్ తనదే అని అన్నారు. టికెట్ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వెల్లంపల్లిపై, బీజేపీ సెంట్రల్‌లో పోటీ చేయాలన్నారు. నిన్న పవన్‌ను కలిసినప్పుడు ఈ విషయం చెప్పినట్లు వివరించారు.
మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.
ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాలు తనిఖీ చేసేందుకు ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల సరిహద్దులో ప్రకాశం బ్యారేజ్ చెక్ పోస్ట్ కీలకమైందన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే వదిలేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటారని చెప్పారు.
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో.. ఒక విద్యార్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డారు. దీంతో పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ విజయలక్ష్మి అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారామయ్య అనే విద్యార్థికి బదులు జోసెఫ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 25, 26 తేదీల్లో సత్రాగచ్చి(SRC), మహబూబ్‌నగర్(MBNR) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 25న నెం.08845 SRC- MBNR, ఈ నెల 26న నెం.08846 MBNR- SRC మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లిలో ఆగుతాయన్నారు.
మచిలీపట్నం మండలం చిన్నాపురంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్లు పై అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆరుగురు వాలంటీర్లపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ MPDO ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకుంటున్నా కొందరు నిబంధనలు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు నేతలు ఆరోపిస్తున్నారు.
సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC)ని ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీ ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు
పెయిడ్ న్యూస్‌ను పర్యవేక్షిస్తుందన్నారు.
పెనమలూరు టికెట్ విషయంలో టీడీపీ అధిష్ఠానం లెక్కలు వేసుకునే పనిలో ఉంటే, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం పెనమలూరులో బోడె ప్రసాద్, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులంతా టీడీపీ జెండాలతోనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఇక చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.
కాపు సంఘం రాష్ట్ర నేత వంగవీటి నరేంద్ర బుధవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నరేంద్ర ఇప్పటి వరకు బీజేపీలో పని చేశారు. ఈయన వంగవీటి రాధాకృష్ణకు సోదరుడు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్‌రెడ్డి, కాపు సంఘం నేతలు పాల్గొన్నారు.
న్యూ ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో ఎన్.శ్రీదేవి కాంస్య పతకం సాధించింది. శ్రీదేవి విజయవాడలోని కేసరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవిని పలువురు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, సహచర అధ్యాపకులు అభినందించారు.
Sorry, no posts matched your criteria.