Krishna

News March 20, 2024

పెనమలూరు కూటమి అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్?

image

పెనమలూరు TDP-జనసేన-BJP కూటమి MLA అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ నారా లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడు. ఇప్పటికే అధిష్ఠానం IVRS సర్వే కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. యువగళం సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈయనకే ఈసారి టికెట్ ఇస్తారని విశ్వసనీయ సమాచారం.

News March 20, 2024

కృష్ణా: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్(ANUEET)-2024 రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తి చేసిన వారికి బీటెక్‌లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను మే నెలలో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు ఏప్రిల్ 7లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం https://www.nagarjunauniversity.ac.in/ చూడవచ్చని చెప్పారు.

News March 20, 2024

కృష్ణా: నాడు వైసీపీకి ప్రత్యర్థులు.. నేడు వైసీపీ అభ్యర్థులు

image

2019లో వైసీపీకి ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన దేవినేని అవినాశ్, వల్లభనేని వంశీ తాజాగా వైసీపీ తరపున బరిలోకి దిగనున్నారు. 2019లో గుడివాడలో టీడీపీ తరపున బరిలో దిగి ఓడిన అవినాష్ వైసీపీలోకి చేరి తాజాగా విజయవాడ తూర్పు నుండి బరిలో దిగనున్నారు. నాడు టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలో చేరి గన్నవరం నుంచి మరోసారి బరిలో నిలిచారు. వీరిని గెలుపు వరించేనా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News March 20, 2024

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని?

image

నేడో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. విజయవాడ తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో విజయవాడ టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

News March 20, 2024

అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచండి: కృష్ణా కలెక్టర్

image

ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో కోడ్ అమలులో ఉందన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి వాటి వివరాలను పంపాలన్నారు. ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఎక్కువ మందికి సొమ్ము జమ అవుతుంటే ఆ వివరాలను తెలియజేయాలన్నారు.

News March 19, 2024

NTR: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు గమనిక

image

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ట్రైన్ నెం.22701 విశాఖపట్నం- గుంటూరు, నెం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌లను ఏప్రిల్ 1 నుంచి 28 వరకూ రద్దు చేస్తున్నట్లు, రైల్వే వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.

News March 19, 2024

నందిగామ: ఘనంగా నూతన కోర్టు భవనాలు ప్రారంభం

image

నందిగామలోని కోర్టు కాంప్లెక్స్ లో నూతన సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, అడిషనల్ జూనియర్ జడ్జి కోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఎన్టీఆర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శేష సాయి, హైకోర్టు జడ్జిలు కృపాసాగర్, గోపాలకృష్ణ మండేల పాల్గొని ప్రారంభించారు.

News March 19, 2024

కృష్ణా: APSDMA అధికారుల ముఖ్య విజ్ఞప్తి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండవద్దని ఆయన సూచించారు. పిడుగులు పడే సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.

News March 19, 2024

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: కలెక్టర్

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్  రాజాబాబు పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

News March 19, 2024

కృష్ణా: బీటెక్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో చదువుతున్న బీటెక్ విద్యార్థులు హాజరు కావాల్సిన 8వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) ప్రాక్టికల్/ వైవా పరీక్షలను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మార్చి 25వ తేదీలోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. ఫీజు వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలన్నాయి.