India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ ఎంపీగా వైసీపీ అభ్యర్థి కేశినేని నాని గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లో రెండూ.. వైసీపీనే సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.
పామర్రులో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా, వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. మరోవైపు, చాణక్య X సర్వే ప్రకారమూ వైసీపీ అభ్యర్థే గెలుస్తారని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రజలు కూటమికే పట్టం కట్టారని ‘చాణక్య X సర్వే ఎగ్జిట్ పోల్’ అంచనా వేసింది. మొత్తం 16 స్థానాల్లో కూటమి 10 సీట్లు గెలుస్తుందని, 2 చోట్ల ఎడ్జ్(TDP) ఉన్నట్లు పేర్కొంది. ఇదే క్రమంలో వైసీపీ 2 సీట్లు గెలుస్తుందని, ఒక చోట ఎడ్జ్ ఉందని చెప్పింది. విజయవాడ వెస్ట్‌లో రెండు పార్టీలకు టఫ్ ఫైట్ ఉంటుందని వివరించింది. ఈ సర్వేపై మీ COMMENT.
కట్టుదిట్టమైన భద్రత మధ్య 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పేర్కొన్నారు. శనివారం మీడియా సెంటర్‌లో విలేకరులలో వారు మాట్లాడారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ప్రజా తీర్పు అందరూ గౌరవించాలని కలెక్టర్ సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన MBA/MCA నాలుగవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లకు గానూ, NDA కూటమి 9-10 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే తెలిపింది. 6-7 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గానూ 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన MBA/MCA నాలుగవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 13నుంచి 14 స్థానాల్లో, వైసీపీ 2-3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని మచిలీ పట్నం పార్లమెంట్ స్థానంలో జనసేన, విజయవాడ నుంచి టీడీపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ PR సర్వే పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గానూ కూటమికి 13, వైసీపీ 2 చోట్ల విజయం సాధించనుండగా.. ఒక చోట టఫ్ ఫైట్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ COMMENT.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 సీట్లలో వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని కేకే సర్వే పేర్కొంది. టీడీపీకి 13 సీట్లు, జనసేనకి 1సీటు, బీజేపీకి 2 సీట్లు వస్తాయని చెప్పింది. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, కైకలూరు నుంచి కామినేని, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ గెలవబోతున్నట్లు సర్వే అంచనా వేస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్‌పై మీ COMMENT.
Sorry, no posts matched your criteria.