India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. ఇక్కడ ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారని తెలిపింది. గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు, పెనమలూరు నుంచి పోటీ చేసిన జోగి రమేశ్ గట్టి పోటీ ఎదుర్కొంటారని వివరించింది. కైకలూరులో కామినేని శ్రీనివాస్ గెలుస్తారని సర్వే చెప్పింది.
పట్టణంలో గుంజా లక్ష్మీ (33)అనే మహిళ శనివారం హిట్ స్ప్రే తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలి పర్సులో సూసైడ్ నోట్ లభించిందన్నారు. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తుందని అదే కాలేజీలో ఆమె భర్త చైతన్య ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడన్నారు. సూసైడ్ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని కోరారు. ఇతర కారణాల వల్ల ప్రజల చనిపోతున్నారని అధికారులు అనడం సరికాదని హితవు పలికారు.
పెనుగంచిప్రోలు మండల పరిధిలో నవాబు పేట వద్ద బొగ్గులోడు లారీలో అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరగా, లారీ డ్రైవర్ అప్పారావు (50) మిత్రులు ఇద్దరు ఆయనతోపాటు జగ్గయ్యపేటకు లారీలో వచ్చినట్లు సమాచారం. జగ్గయ్యపేటలో ఈ ఇద్దరు మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లాలో రాగల 3 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో టవర్స్, ఐరన్ పోల్స్, చెట్ల కింద ఉండకూడదని సూచించింది. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేసింది.
ఎన్నికల ఫలితాల కోసం కృష్ణా జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీపీఈడీ/డీపీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్- BLISC డిగ్రీ పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
నేడు విజయవాడలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు ప్రింట్ అండ్ స్టేషనరీ డిపార్ట్మెంట్ డీజీగా పదవీ విరమణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ఆయన ఘనంగా సత్కరిస్తున్నారు. మరోవైపు తాడేపల్లిలో సీఎం జగన్ ఓఎస్డి ధనుంజయ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ధనుంజయ రెడ్డిని సన్మానించడానికి పలువురు వైసీపీ నేతలు తరలివస్తున్నారు.
రేపు శనివారం కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సైతం తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.