Krishna

News May 27, 2024

లోటుపాట్లు లేకుండా ఓట్ల లెక్కింపు చేపట్టాలి: డీకే బాలాజీ

image

ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో సజావుగా ఓట్ల లెక్కింపు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఓట్ల లెక్కింపుపై సంబంధిత ఎన్నికల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా యూనివర్సిటీని సందర్శించనున్నారన్నారు.

News May 27, 2024

రాష్ట్ర వ్యాప్తంగా 502 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్: డీజీపీ

image

జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 502 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లో భాగంగా 2,602 సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం, 23 మంది రౌడీ, సస్పెక్ట్ షీటర్లు అరెస్ట్ చేశామని అన్నారు. 307 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు.

News May 27, 2024

కృష్ణా: డిగ్రీ, పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ (డిస్టెన్స్) 2024 ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన పలు పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు అన్ని పీజీ కోర్సులు (ఇయర్ ఎండ్), బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ (BLISC) డిగ్రీ కోర్సుల ఫలితాలు నేడు విడుదల చేశామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఫలితాలకు http://www.anucde.info/ అధికారిక వెబ్‌సైట్ను సందర్శించాలని సూచించారు.

News May 27, 2024

బాడిగ జయ చరిత్ర సృష్టించారు: నటి మంచు లక్ష్మి

image

కాలిఫోర్నియాలో న్యాయమూర్తిగా నియమితులైన విజయవాడకు చెందిన బాడిగ జయకు నటి మంచు లక్ష్మీ అభినందనలు తెలిపారు. తొలి తెలుగు మహిళగా జయ హద్దులు బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించారని ‘x’లో పోస్ట్ చేశారు. ఆమె తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు నటి పేర్కొన్నారు. ఇటీవల కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా జయ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

News May 27, 2024

యెర్నేని సీతాదేవి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

image

కలిదిండి మండలం కొండూరుకు చెందిన మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా సీతాదేవి తనదైన ముద్ర వేశారని ఆయన కొనియాడారు. సీతాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

News May 27, 2024

మచిలీపట్నం: జనసేన నేత కారు దగ్ధం కేసులో దర్యాప్తు వేగవంతం

image

మచిలీపట్నానికి చెందిన జనసేన నేత కర్రి మహేశ్ కారు దగ్ధం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ అబ్దుల్ సుభాన్ బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఘటనాస్థలిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదవశాత్తు కారు దగ్ధమైందా.? లేక రాజకీయ ప్రేరేపితం ఉందా.? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 27, 2024

కృష్ణా: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

image

ఎండల తీవ్రత నేపథ్యంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. నీటి లభ్యత లేని కారణంగా ఉత్పత్తి తగ్గిపోవడంతో టమాటా (కేజీ-రూ.40), వంకాయ (కేజీ- రూ.45), పచ్చిమిర్చి (కేజీ- రూ.80), బెండ (కేజీ -రూ.44), బీన్స్ (కేజీ రూ-180) ధరలు పలుకుతున్నాయి. మైలవరం, అవనిగడ్డ, నందిగామ, కంచిచర్ల, జగ్గయ్యపేట నుంచి వచ్చే టమాటా.. గుంటూరు జిల్లా నుంచి వచ్చే బెండ, దొండ, వంకాయల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

News May 27, 2024

విజయవాడలో 27న రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు

image

ఎన్టీఆర్ జిల్లా చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మే 27, 28న జరగబోయే రాష్ట్రస్థాయి సీనియర్, పురుషుల మహిళల ఓపెన్ చదరంగం పోటీలకు సర్వం సిద్ధమని జిల్లా కార్యదర్శి మందుల రాజీవ్ ఆదివారం తెలిపారు. రాజీవ్ మాట్లాడుతూ.. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో పాటు నగదు బహుమతి కూడా ఉందన్నారు.

News May 26, 2024

విజయవాడ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది వీరే

image

విజయవాడ నగరంలో రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇద్దరు సంఘటన స్థలంలోని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కృష్ణలంక సీఐ మురళీకృష్ణ స్పందించారు. మృతులు మంగళగిరికి చెందిన మునీర్ బాషా, జరీనా గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు.

News May 26, 2024

విజయవాడలో విషాదం.. యువతి, యువకుడి మృతి

image

విజయవాడలో ఆదివారం రాత్రి భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని రాజీవ్ గాంధీ పార్క్ వద్ద యువతీ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజయవాడ శివారు ఎనికేపాడుకు చెందిన ఇద్దరు స్కూల్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కృష్ణలంక సీఐ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని మృతులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

error: Content is protected !!