India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం చల్లపల్లి మండలం పాగోలులో పర్యటించారు. తమ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏపీ క్యాంపస్ పరిశీలించారు. ఆమెకు సిబ్బంది, టీడీపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులతో సమావేశమైన భువనేశ్వరి వారితో మాట్లాడి స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి వారితో కలిసి భోజనం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించాలని నారా భువనేశ్వరి కోరారు.

మచిలీపట్నం నుంచి బదిలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్ చంద్రయ్యకు హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అకారణంగా విధుల నుంచి సస్పెండ్ చేసిన ఆర్ఓ వెంకటేశ్‌ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఆరు నెలల జైలు శిక్షతోపాటు రూ.2వేలు జరిమానా విధించింది.

కృష్ణా వర్శిటీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2025 జనవరి, జూన్ నెలల్లో ఫస్టియర్ విద్యార్థులకు ఒకటి, రెండవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయంది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

రాష్ట్రంలో వర్షాలు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో 8 జిల్లాల కలెక్టర్లు, DROలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్‌ను అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అలర్ట్ సెంటర్ విధులను అక్కడి అధికారులు ఆమెకు వివరించారు.

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి గొల్లా జ్ఞానమణి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మౌఖిక ఆదేశాల మేరకు వైస్ ఛాన్స్‌లర్ పదవిలో ఉన్న జ్ఞానమణి రాజీనామా చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా 2023 సంవత్సరం ద్వితీయార్థంలో కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా జ్ఞానమణి నియామకమయ్యారు.

గత ప్రభుత్వ పాలనలో దేవుడి పేరుతో దందాలు చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ట్వీట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించాలని రాసిన సిఫారసు లేఖతో ఈ దందా బైటపడిందన్నారు. భక్తుల సౌకర్యాల గురించి ఏనాడూ పట్టించుకోని వైసీపీ నాయకులు దేవుడి పేరు చెప్పి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఉమ Xలో పోస్ట్ చేశారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో ఫార్మ్-డీ (ఐదో ఏడాది) కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 3, 5, 8 తేదీల్లో ఉదయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టు వారీగా షెడ్యూల్ వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

ప్రజలు ఇంటితో పాటు, పరిసరాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సుహాసిని ప్రకటనలో తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ముందస్తుగా తీసుకునే చర్యల గురించి వివరిస్తున్నామన్నారు. బయట ఆహారాలు తినకుండా, ఇంట్లో తయారు చేసిన వేడి వేడి ఆహారం తీసుకుంటే మంచిదన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతోందని మచిలీపట్నంలో నిర్మిస్తున్న YCP కార్యాలయానికి బుధవారం నోటీసులిచ్చారు. YCP జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో కొత్త భవనం వద్దకు వెళ్లి అక్కడున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. 1000 చదరపు గజాల విస్తీర్ణం దాటిన భవనాలకు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని, అలా జరగనందునే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన నాలుగవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 24, 26, 29, 31, ఆగస్టు 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.