Krishna

News May 29, 2024

ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

image

ఇబ్రహీంపట్నం సమీపంలో హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు, జాతీయ రహదారి సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు.

News May 29, 2024

కృష్ణా: నేడు పాలీసెట్ కౌన్సిలింగ్ వీరికే..

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి నేడు (బుధవారం) పాలీసెట్-2024లో 27,001- 43,000 వరకు ర్యాంక్ పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని 3 హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని కౌన్సిలింగ్ నిర్వాహకులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామన్నారు.

News May 28, 2024

కృష్ణా: డిప్లమా విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లమా పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 28, 2024

కృష్ణా: ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1, 3, 5, 6, 7, 8వ తేదీల్లో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
– SHARE IT

News May 28, 2024

కృష్ణా: పాలిసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యేవారికి ముఖ్య సూచన

image

పాలిసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కింది ధ్రువపత్రాలు తెచ్చుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు సూచించారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించిన రసీదు, పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, SSC మార్కుల జాబితా, 4-10 తరగతుల స్టడీ, రెసిడెన్షియల్ సర్టిఫికెట్స్, EWS వర్తించే వారికి సంబంధిత ధ్రువపత్రాలు, ప్రత్యేక కేటగిరి నిర్ధారించే ధ్రువపత్రాలు తీసుకొని రావాలన్నారు.

News May 28, 2024

కృష్ణా: పీజీ పరీక్షల రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన పీజీ పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 28, 2024

తొలి ఫలితం SC నియోజకవర్గాల్లో.. గెలుపు ఎవరిదో?

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో ప్రారంభం కానుంది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తొలి ఫలితాలు SC నియోజకవర్గాలైన నందిగామ, పామర్రుల నుంచి వెలువడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఈ తొలి ఫలితాల్లో ఎవరిది ( వైసీపీ or కూటమి ) పై చేయి కానుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News May 28, 2024

గుడివాడతో ఎన్టీఆర్‌కు ప్రత్యేక అనుబంధం

image

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌‌కు గుడివాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ స్థాపన అనంతరం జరిగిన 1983, 85 ఎన్నికలలో ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేసి విజయదుందుభి మోగించారు. అనంతరం ఆయన స్మారకార్థం గుడివాడలో ఎన్టీఆర్ పేరు మీద స్టేడియం నిర్మించారు. రెండు సార్లు తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన గుడివాడ గురించి ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా చెబుతుండేవారు. నేడు ఎన్టీఆర్ జయంతి.

News May 28, 2024

విజయవాడలో సీఎం జగన్‌పై దాడి కేసులో నేడు తీర్పు

image

ఏప్రిల్ 13న విజయవాడలో జగన్‌పై గులకరాయి దాడి కేసు విచారణలో భాగంగా నేడు తీర్పు రానుంది. ఈ కేసు విచారిస్తున్న విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. కేసు విచారణలో భాగంగా అరెస్టైన సతీశ్‌ను అక్రమంగా ఇరికించారని అతడి తరఫు లాయర్ సలీం కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ సతీశ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది.

News May 28, 2024

పామర్రులో తొలి ఫలితం వచ్చే అవకాశం

image

కృష్ణా జిల్లాకు సంబంధించి జూన్ 4న మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్ని నియోజకవర్గాలకు 14 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు పక్రియ కొనసాగిస్తారు. కాగా, జిల్లాలో తొలి ఫలితం పామర్రుది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రౌండ్ల సంఖ్య 17 కాగా, అభ్యర్థులు 8 మందే పోటీలో ఉన్నారు. దీంతో తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని తర్వాత మచిలీపట్నం ఫలితం రావొచ్చని చెబుతున్నారు.