Krishna

News June 9, 2024

కృష్ణా జిల్లాలో మంత్రి పదవి ఎవరికి.?

image

తాజా ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TDP అభ్యర్థులు గెలిచారు. త్వరలో చంద్రబాబు CMగా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో కృష్ణా నుంచి మంత్రివర్గంలో ఎవరు చోటు దక్కించుకుంటారనే చర్చ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జరుగుతోంది. కొల్లు రవీంద్ర, వెనిగండ్ల రాము, జనసేన నుంచి మండలి బుద్దప్రసాద్, ముందువరుసలో ఉన్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందని అనకుంటున్నారో COMMENT చేయండి.

News June 9, 2024

నూజివీడు నియోజకవర్గంలో NOTAకు భారీగా ఓట్లు

image

నూజివీడు నియోజకవర్గంలో నోటా ( NOTA – None of the above)కు భారీగా 2,771 ఓట్లు పడ్డాయి. నూజివీడు లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మరీదు కృష్ణ సాధించిన ఓట్ల (2405) కంటే నోటా సాధించిన ఓట్లే అత్యధికం. కాగా నూజివీడులో కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి, సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై 12,378 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News June 8, 2024

కృష్ణా: రేపే ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్- 2024 పరీక్ష

image

ఏపీ ఉన్నత విద్యా మండలి(APSCHE) ఆధ్వర్యంలో జరిగే ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష- లాసెట్, ఏపీ పీజీ లాసెట్- 2024 పరీక్షలు రేపు ఆదివారం జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం 2.30- 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ సత్యనారాయణ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ పరీక్ష హాల్‌టికెట్లను https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News June 8, 2024

కృష్ణా: రేపే ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్- 2024 పరీక్ష

image

ఏపీ ఉన్నత విద్యా మండలి(APSCHE) ఆధ్వర్యంలో జరిగే ఉమ్మడి న్యాయ ప్రవేశ పరీక్ష- లాసెట్, ఏపీ పీజీ లాసెట్- 2024 పరీక్షలు రేపు ఆదివారం జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం 2.30- 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ సత్యనారాయణ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ పరీక్ష హాల్‌టికెట్లను https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

News June 8, 2024

విజయవాడ: జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు 

image

ముస్తాబాద్- గన్నవరం సెక్షన్‌లో ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.12806 జన్మభూమి SF ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ శనివారం నుంచి జూన్ 30 వరకు విజయవాడ- ఏలూరు- టీపీగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. జూన్ 30 వరకు ఈ ట్రైన్‌కు నూజివీడు, ఏలూరు, టీపీగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు. 

News June 8, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎక్కడ.?

image

సీఎంగా TDP అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 12వ తేదీ ముహూర్తం ఖరారైంది. కాగా, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములు, గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ భూములను TDP నేతలు పరిశీలించారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో రానుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టుకు సమీపంలో అయితే బాగుంటుందని భావించారు. చంద్రబాబు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న నేతలు, ఆయన అంగీకారంతో సభ ఎక్కడనేది ఫైనల్ చేయనున్నారు.

News June 8, 2024

గుడివాడలో డిగ్రీ వరకు చదివిన రామోజీరావు

image

కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు గుడివాడలోనే డిగ్రీ వరకు చదువుకున్నారు. తల్లిదండ్రులు ఆయనకు రామయ్య అని పేరు పెట్టగా.. పాఠశాలలో తన పేరు రామోజీరావు అని చెప్పి పరిచయం చేసుకున్నారు. ఇలా తన పేరును తానే పెట్టుకున్నారు. ఈ తెల్లవారుజామున రామోజీ మరణంతో కృష్ణా జిల్లాలోని ఆయన సన్నిహితులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

News June 8, 2024

నగరానికి మరింత మెరుగ్గా సేవలందిద్దాం: కలెక్టర్

image

ఇంతకన్నా మెరుగ్గా విజయవాడ నగరానికి సేవలందిద్దామని శుక్రవారం నగర క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పేర్కొన్నారు. ఏపీ, ఎస్సీ ఎన్జీవోస్‌లో ఖాళీ అయిన పదవులు కో ఆప్షన్ పద్ధతిలో.. ఎన్నిక కాబడిన నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్, రాజశేఖర్, శ్రీనివాసరావు, ఎస్.కె నజరుద్దీన్, బిఎస్ఎన్ శ్రీనివాస్ సంఘ నాయకులతో కలసి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఢిల్లీ రావుకు పుష్పగుచ్చం అందజేశారు.

News June 7, 2024

గన్నవరంలో “నారా చంద్రబాబునాయుడు” అను నేను

image

గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 12 ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నేతలు టీడీ జనార్దన్, అచ్చెన్నాయుడు తదితరులు శుక్రవారం కేసరపల్లిలో ఎంపిక చేసిన సభాస్థలాన్ని పరిశీలించారు.

News June 7, 2024

ఎన్నికల నియమావళి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కలెక్టర్

image

మే 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు శుక్రవారం ప్రకటించారు. 16వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు.. తదుపరి 48 గంటల వరకు ఈ నియమావళి అమలులో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగేందుకు ఉపయోగపడిందన్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.