Krishna

News June 7, 2024

ఈవీఎం, వీవీప్యాట్ల‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌: కలెక్టర్

image

సాధార‌ణ ఎన్నిక‌లు-2024 నిర్వ‌హ‌ణ‌లో ఉప‌యోగించిన ఈవీఎం, వీవీప్యాట్ల‌ను క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తతో గోదాములో భ‌ద్ర‌ప‌రిచిన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌ డిల్లీరావు వెల్ల‌డించారు. జిల్లాలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ పూర్త‌యినందున.. గొల్ల‌పూడిలోని గోదాములో ఈవీఎం, వీవీప్యాట్ల‌ను భ‌ద్ర‌ప‌రిచి శుక్రవారం సీల్ వేశారు.

News June 7, 2024

తొలిసారి బరిలో నిలిచినా కేశినేని శివనాథ్ రికార్డ్

image

విజయవాడ లోక్‌సభకు 1952 నుంచి 18 సార్లు ఎన్నికలు జరిగాయి. తాజా ఎన్నికలలో కేశినేని శివనాథ్ (చిన్ని) సాధించిన 2,82,085 మెజారిటీనే అత్యధికం. 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన KLరావు సాధించిన 1,56,004 ఓట్ల మెజారిటీని తాజా ఎన్నికల్లో చిన్ని తన భారీ మెజారిటీతో చెరిపేశారు. చిన్ని తాజా గెలుపుతో విజయవాడ లోక్‌సభలో వరుసగా 3వ సారి టీడీపీ జెండా ఎగిరింది.

News June 7, 2024

నూజివీడు: చూసి నవ్వినందుకు.. కత్తిపోట్లు

image

నూజివీడులో నిన్న <<13390738>>కత్తిపోట్ల ఘటన<<>> కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు.. నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయి, సుధీర్‌ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్‌ వచ్చి గిరీష్‌ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.

News June 7, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల కోడ్ నిలుపుదల: ఢిల్లీ రావు

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ ప్రవర్తన నియమావళి జూన్ 4న ఓట్ల లెక్కింపు ముగిసిన తదుపరి 48 గంటల వరకు అమల్లో ఉందన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.

News June 6, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న రీవాల్యుయేషన్ దరఖాస్తు గడువు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలకు(సెమిస్టర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 6, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాం: ఢిల్లీరావు

image

ప్రశాంత వాతావరణంలో నిర్వ‌హించ‌డంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు. నేడు విజయవాడలో అధికారుల‌తో స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు, సిబ్బంది నిబద్దతతో వ్యవహరిస్తూ.. విధులు నిర్వర్తించారని తెలిపారు. అన్ని విధాలా సహకరించిన జిల్లా ప్రజలకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

News June 6, 2024

కృష్ణా: బీ- ఫార్మసీ పరీక్షల ఫలితాల విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీ- ఫార్మసీ ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 6, 2024

కృష్ణా: ఎన్నికల నిర్వహణలో కలెక్టర్, ఎస్పీల కృషి భేష్

image

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీం చేసిన కృషి సఫలీకృతమైంది. ఏ చిన్న పొరపాటుకు అస్కారం లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరువురు అధికారులు ఎంతో సమస్వయంతో వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలకు లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన కలెక్టర్, ఎస్పీలు జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. 

News June 6, 2024

విజయవాడ: ’16న సివిల్స్ ప్రిలిమ్స్‌కు పటిష్ఠ ఏర్పాట్లు’

image

యూపీఎస్సీ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్న నేప‌థ్యంలో యూపీఎస్సీ అధికారులు.. ప‌రీక్షా కేంద్రాలున్న జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్‌కు కలెక్ట‌ర్ డిల్లీరావు క్యాంపు కార్యాల‌యం నుంచి హాజ‌ర‌య్యారు. విజ‌య‌వాడ‌లో ప‌రీక్షను విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ప‌టిష్ఠ ప్ర‌ణాళిక‌తో ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు.

News June 6, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న రీ వాల్యుయేషన్ గడువు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా, పీజీ కోర్సుల పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపు శుక్రవారంలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.