Krishna

News May 24, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్..పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని పీజీ- మాస్టర్ ఆఫ్ లా(LLM) కోర్స్ 3వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 24, 2024

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06271 SMVB- BBS రైలును ఈ నెల 31న, నం.06272 BBS- SMVB రైలును జూన్ 2వ తేదీన నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 24, 2024

జయ బాడిగకు అభినందనలు తెలిపిన చంద్రబాబు

image

కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా జయ బాడిగ ఇటివల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు X వేదికగా అభినందనలు తెలిపారు. జయ బాడిగ విజయవాడకు చెందిన వారు కావడం గర్వకారణమని అన్నారు. ఆమె పదవి కాలాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని అన్నారు.

News May 24, 2024

విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

కృష్ణా నది వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని వన్ టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి తెలిపారు. కృష్ణానది వద్ద స్థానికులు గుర్తుతెలియని మృతదేహం ఉందన్న ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా 50 సంవత్సరాల వ్యక్తి గల మృతదేహం లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసిన యెడల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News May 24, 2024

కృష్ణా: తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్‌కోయిల్ (NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 06105 NCJ- DBRG రైలును జూన్ 14,21,28 తేదీలలో, నం.06106 DBRG- NCJ రైలును జూన్ 19, 26, జులై 3వ తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 24, 2024

రేవ్ పార్టీలో ఇద్దరు విజయవాడ వాసులు అరెస్ట్?

image

బెంగుళూరు రేవ్ పార్టీలో అరెస్టై రిమాండ్‌కు పంపబడ్డ వారిలో విజయవాడ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వాహకులలో విజయవాడకు చెందిన బుకీ వాసు A1గా, వన్‌టౌన్‌కు చెందిన D. నాగబాబు A3గా FIR నమోదైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. బుకీ వాసు పుట్టినరోజు సందర్భంగా పార్టీ నిర్వహించగా పోలీసుల దాడులలో రేవ్ పార్టీ ఘటన వెలుగు చూసింది.

News May 24, 2024

ఎన్టీఆర్: విధుల్లో అలసత్వం.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

విధులలో అలసత్వం ప్రదర్శించిన జగ్గయ్యపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం ఎం. వాణి, విజయవాడ మొగల్రాజపురం BSRK హైస్కూల్ హెచ్ఎం ఎల్. రమేశ్‌ను DEO యూవీ. సుబ్బారావు తాజాగా సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకల కారణంగా వాణిని, విద్యాశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రమేశ్‌ను సస్పెండ్ చేసినట్లు DEO సుబ్బారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

News May 24, 2024

IFSలో సత్తా చాటిన రంగన్నగూడెం యువకుడు

image

బాపులపాడు మండలం రంగన్నగూడెంకి చెందిన తుమ్మల కృష్ణ చైతన్య ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2023లో జాతీయ స్థాయిలో 74వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. కృష్ణ చైతన్య తండ్రి వీర రాజారావు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య ప్రస్తుతం అమరావతి సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. IFSలో జాతీయ ర్యాంక్ సాధించిన కృష్ణ చైతన్యను పలువురు అభినందించారు.

News May 24, 2024

కృష్ణా: లా కోర్స్ విద్యార్థులకు గమనిక

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని LLB 4వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జూన్ 4వ తేదీలోపు అపరాధరుసుం లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజుల వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను తనిఖీ చేసుకోవాలని కోరాయి.

News May 24, 2024

కృష్ణా: ఈ నెల 25తో ముగియనున్న గడువు

image

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు రాయాల్సిన ఎడ్‌సెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులు దొర్లి ఉంటే ఏపీ ఉన్నత విద్య మండలి సవరించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులలో కరెక్షన్స్ ఉంటే ఈ నెల 25లోపు సరిదిద్దుకోవచ్చని సూచించింది. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.