India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముదినేపల్లిలో గురజ రహదారిలో మెగా సంస్థకు చెందిన గ్యాస్ పైప్ లైన్ ప్రమాదవశాత్తు లీక్ కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఎదురుగా పెట్రోల్ బంక్ ఉండటంతో భారీ ప్రమాదం జరుగుతుందని భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట్ కుమార్, గుడివాడ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. మంటలు ఏర్పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్/మే 2024లో నిర్వహించిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు మే 24వ తేదీలోగా.. ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.8,00 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.
మండలంలోని ఒర్లగొందితిప్ప గ్రామానికి చెందిన దుర్గారావు (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు దుర్గారావు, అతని భార్య దుర్గల మధ్య కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పల్నాడులో పెద్ద పెద్ద మెత్తంలో పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు విజయవాడ నగరంలో సీసాలు, డబ్బాలలో పెట్రోల్ విక్రయాలు నిషేదించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, పోలీస్ కమిషనర్ తమకు ఆదేశాలు జారీ చేశారని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వెల్లడించాయి. ఈ మేరకు ఎం.జీ రోడ్డులోని పైలట్ సర్వీస్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్, డీజిల్‌ను డబ్బాలలో విక్రయించేది లేదని స్పష్టం చేశాయి
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా మంబై స్వదేశీ సర్వీస్ నడిపేందుకు ఎయిర్ ఇండియా విమాన సంస్థ ముందుకొచ్చింది. జూన్ 15 నుంచి ప్రత్యేక ముంబై సర్వీస్ నడపనున్నట్లు విమాశ్రయ అధికారులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం 3.55గంటలకు చేరుకోనున్న సదరు సర్వీస్ రాత్రి 7.10గంటలకు తిరిగి బయలుదేరి 9 గంటలకు ముంబై చేరుకుంటుందన్నారు. ఈ సర్వీస్ 180మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంటుందన్నారు.
విజయవాడ రైల్వే డివిజన్లో నిర్వహణ పనుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 27 నుంచి జాన్ 4 వరకు మచిలీపట్నం-విశాఖపట్నం మధ్య నడిచే రైలు నం.17219, రైలు నం.17220 రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.
జి.కొండూరులో వ్యాన్ టైర్లు పేలి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ప్రవీణ్(36)అనే వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు మంగళగిరికి చెందిన ప్రసాదరావు, ఇర్మీయా, ప్రవీణ్ గేదెల వ్యాపారం చేస్తుంటారు. శుక్రవారం తిరువూరులో గేదెలు కొని మంగళగిరి వెళుతుండగా జి.కొండూరులో వ్యాను టైర్ పేలి ప్రవీణ్ మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ముగిసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా నియోజకవర్గంలో 17,04,077 మంది ఓటర్లు ఉంటే వారిలో 13,69,985 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వివిధ కారణాలతో 3,34,092 మంది ఓటు వేయలేదు. ఇక్కడ నుంచి కేశినేని నాని (వైసీపీ), కేశినేని చిన్ని(కూటమి), తదితరులు పోటీ చేయగా.. ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో COMMENT చేయండి.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో కృష్ణా జిల్లాలో 18.9మి.మీల సరాసరి వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గడిచిన 24గంటల్లో ఈ వర్షపాతం నమోదైందని అన్నారు. అత్యధికంగా అవనిగడ్డలో 49.8 మి.మీలు నమోదవ్వగా అత్యల్పంగా గన్నవరంలో 4.4మి.మీలు నమోదైందని తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లోనూ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారికి చంద్రశేఖర రావుతో కలిసి రెవెన్యూ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.