India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ఈ నెల 20వ తేదీన వర్షం పడే అవకాశముందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్(APSDMA) అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశముంటుందని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
బహుజన సమాజ్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.. విజయవాడ హనుమాన్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసే తమ 11 మంది లోక్ సభ, 50 మంది శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరం జ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.
విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా 3వ సారి పోటీ చేస్తున్న కేశినేని నాని అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. విజయవాడలో ఇప్పటి వరకూ 17 సార్లు ఎన్నికలు జరగగా కానూరి లక్ష్మణరావు మాత్రమే 1962, 67, 71లో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014, 19లో టీడీపీ నుంచి గెలిచిన నాని రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిస్తే లక్ష్మణరావు రికార్డును సమం చేసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేశ్ కుమార్ మీనాను సచివాలయంలో సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కలిసారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరిగే డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయించాలని వినతి పత్రం అందించారు. అభ్యర్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని తగ్గించాలని ప్రిపరేషన్‌కు తగిన సమయం ఉండేలా చూడాలని కోరారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ, స్పెషల్ బీఈడీ 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల 2020, 2021, 2022బ్యాచ్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 25నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు బొడె ప్రసాద్‌కు పిలుపునిచ్చారు.. సోమవారం ఉదయం 11:30గంటలకు పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నుంచి బోడె ప్రసాద్‌కు ఫోన్ కాల్ చేశారు. ఇప్పటికే పెనమలూరు టికెట్ కేటాయించకపోవడంతో బొడె ప్రసాద్ తన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు టీడీపీ మూడో జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో బొడె ప్రసాద్‌ను పిలిపించడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో శనివారం రాత్రి కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సై సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిందితునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
కొండెక్కిన కోడి ధరలు దిగివస్తున్నాయి. విజయవాడలో గత వారం క్రితం రోజుల క్రితం వరకు మార్కెట్లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో చికెన్ స్కిన్లెస్ కిలో రూ.200 నుంచి రూ.220 ధర పలుకుతోంది. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గింది. దీంతో నాన్‌వెజ్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ఎన్టీఆర్ జిల్లా సీపీ TK రాణా స్పందన కార్యక్రమ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో రేపు సోమవారం జరగవలసిన స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకం, సంబంధిత అధికారులు ఈ విషయం గమనించవలసిందిగా రాణా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున కలెక్టర్ రాజబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్టణం కలెక్టరేట్లో రేపు సోమవారం జరగవలసిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజానీకం, సంబంధిత అధికారులు ఈ విషయం గమనించవలసిందిగా కలెక్టర్ కోరారు.
Sorry, no posts matched your criteria.