India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా అభివృద్ధికి భూములను ఇచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై, తగిన ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

సౌజన్య అనే మహిళ మరోవ్యక్తితో కలిసి విజయవాడలో ఓ కన్సల్టెన్సీ ద్వారా కొందరిని విజిటింగ్ వీసా ద్వారా కెనడా పంపించారు. అక్కడ సౌజన్యకు పార్ట్‌నర్‌తో విబేధాలు రాగా ఏలూరు రోడ్డులో సొంతంగా కన్సల్టెన్సీ ఓపెన్ చేసింది. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తానని గుంటూరు, కృష్ణా, ఏలూరుకు చెందిన 40మంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. బాధితులు విజయవాడ సీపీ రామకృష్ణను ఆశ్రయించగా ఆయన కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు.

మాజీ సీఎం జగన్‌కు విజయవాడ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘జగన్ రెడ్డి నీకు 151 సీట్లు వచ్చినప్పుడు అది మీ విజయమా ? అదే మాకు 164 సీట్లు వస్తే ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పులివెందులలో రాజీనామా చెయ్. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలకు వెళ్దాం. నీకు మొన్న వచ్చిన మెజారిటీ అయినా వస్తుందో రాదో, అసలు గెలుస్తావో లేదో చూద్దాం. ఇకనైనా నీ చిలక జోస్యం ఆపు’ అని Xలో పోస్ట్ చేశారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం జిల్లాల విభజన తర్వాత ఏలూరు జిల్లాలోకి వెళ్లింది. NTR జిల్లాను ఆనుకొని ఉండే ఇక్కడి ప్రజలకు విజయవాడ, గన్నవరంతో ఎక్కువగా సంబంధాలు ఉంటాయి. ఎన్నికలకు ముందు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దాని ప్రకారం నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారా.? కృష్ణా జిల్లా పరిధిలోకి తీసుకొస్తారా.? అనే విషయం తెలియాల్సి ఉంది.

మాజీ మంత్రి జోగి రమేశ్ కంకిపాడు గ్రామంలోకి రావద్దంటూ ఆ గ్రామ బస్టాండ్ వద్ద భారీ బ్యానర్ వెలిసింది. పవన్ కళ్యాణ్‌ను పదే పదే వ్యక్తిగతంగా విమర్శించిన ఆయన్ను కంకిపాడులో ఏ కార్యక్రమానికీ ఆహ్వానించొద్దంటూ దానిపై రాశారు. ఆయన హాజరైతే తదుపరి పరిణామాలకు వైసీపీ వారే బాధ్యులు అని రాయడం కలకలం రేపింది. బ్యానర్ ఏర్పాటు వివాదాస్పదం కావడంతో పోలీసులు ఆ బ్యానరును తొలగించారు.

ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున నం.12803, నం.12804 స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 5 వరకు విజయవాడ-బల్లార్షా-నాగ్‌పూర్ మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా నాగ్‌పూర్ చేరుకుంటాయన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు.

నూజివీడు నియోజకవర్గం నుంచి TDPతరఫున MLAగా గెలిచిన కొలుసు పార్థసారథికి సమాచార శాఖ, గృహనిర్మాణ మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గానికి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నూజివీడులో పార్టీ శ్రేణులు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానులు ఆయనకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు ఇవ్వగా అవి పట్టుకొని ర్యాలీగా ముందుకుసాగారు.

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన BA.LLB కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 24లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

కృష్ణా- ఆర్టీసీ బస్సు ప్రయాణికులు తమ సందేహాలు, ఫిర్యాదులు, అభిప్రాయాలు, సూచనలు, సమాచారానికై APSRTC కాల్ సెంటర్ నంబర్ 149కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు RTC అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కాల్ చేస్తున్నట్లైతే 0866-149 నెంబరుకు డయల్ చేయాలని APSRTC అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈనెల 19వ తేదీన రాష్ట్రంలోని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్యేలు ఎంపీలతో మాజీ సీఎం జగన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు అందరికీ ఆహ్వానాలు ప్రకటించారు. ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వైసీపీ నాయకులు అందరికీ ఆహ్వానం పంపించినట్లు వైసీపీ కార్యాలయం తెలిపింది.
Sorry, no posts matched your criteria.