Krishna

News May 15, 2024

పామర్రు: రహదారిపై అగ్ని ప్రమాదం.. దగ్ధమైన కారు

image

పామర్రు నియోజకవర్గం కురుమద్దాలి వద్ద ప్రధాన రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రాంతానికి వచ్చి మంటలను ఆర్పేశారు.. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 15, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలుపు ఎవరిది.?

image

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 స్థానాల్లో గెలిచి పూర్తి ఆధిక్యం సాధించింది. టీడీపీ కేవలం 2 స్థానాలు (గన్నవరం , విజయవాడ ఈస్ట్) కే పరిమితమైంది. అటు 2 పార్లమెంట్ స్థానాల్లో చెరొకటి గెలుపొందాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయకేతనం ఎగురవేసే పార్టీ ఏదో కామెంట్ చేయండి.

News May 15, 2024

కృష్ణా: క్రికెట్ మ్యాచ్‌ల తరహా పొలిటికల్ బెట్టింగ్ 

image

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ, గెలుపు మాదంటే మాదంటూ ఆయా రాజకీయ పార్టీలకు చెందిన బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులను తలదన్నేలా కోట్ల రూపాయలలో బెట్టింగులు కొనసాగుతున్నాయి. కోడిపందాల మాదిరిగా పందాలు కాస్తున్నారు. ఒక నియోజకవర్గంతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాలలో పందాలు సాగుతున్నాయని పలువురు చర్చిచుంకుంటున్నారు.

News May 15, 2024

NTR: జిల్లాలో ఎస్సీ నియోజకవర్గాల్లో అత్యధిక పోలింగ్

image

ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం జగ్గయ్యపేట నియోజకవర్గం (89.88%) లో నమోదు కాగా ఆ తరువాత రెండు స్థానాలను ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు (87.68%), నందిగామ (87.56%) కైవసం చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. మరి ఈసారి తిరువూరు, నందిగామ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేసేదెవరో కామెంట్ చేయండి.

News May 15, 2024

విజయవాడ వెస్ట్‌లో 66.46% పోలింగ్

image

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 66.46% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యల్పం. నియోజకవర్గంలో మొత్తం 2,55,963 మంది ఓటర్లకు గానూ 1,70,104 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 85,255 మంది ఉండగా, మహిళా ఓటర్లు 84,833, ఇతరులు 16 మంది ఉన్నారు. నగరంలో ఇంత తక్కువ ఓటింగ్ నమోదవడం చర్చనీయంశమైంది.

News May 15, 2024

మైలవరం: ఇక్కడ 99.22 శాతం పోలింగ్

image

మైలవరం నియోజకవర్గంలో 85.36 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, నియోజకవర్గ పరిధిలోని రెడ్డిగూడెం మండలంలో ఓటర్ల చైతన్యం కనిపించింది. అడవి కొత్తూరు గ్రామంలోని 8వ పోలింగ్ కేంద్రంలో 99.22 శాతం మంది ఓటేశారు. మొత్తం 129 మంది ఓటర్లకు గానూ 128 మంది ఓటేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ పోలింగ్ బూత్‌లోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.

News May 15, 2024

విజయవాడ లోక్ సభ స్థానంలో 79.36% మేర పోలింగ్

image

* తిరువూరులో 2,07,190 మందికి 1,81,669 (87.68%)* విజయవాడ వెస్ట్ లో 2,55963 మందికి 1,70,104 (66.46%) (అత్యల్పం)* విజయవాడ సెంట్రల్ లో 2,77,724 మందికి 2,02,635 (72.96%)* విజయవాడ ఈస్ట్ లో 2,70,624 మందికి 1,93,026 (71.33%)* మైలవరంలో 2,81,732 మందికి 2,40,487 (85.36%)* నందిగామలో 2,05,480 మందికి 1,79,915 (87.56)* జగ్గయ్యపేటలో 2,05,364 మందికి 1,84,575 (89.88%) (అత్యధికం)

News May 15, 2024

ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక పోలింగ్ ఇక్కడే.!

image

ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 79.36శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జగ్గయ్యపేటలో 89.88%, విజయవాడ పశ్చిమలో 66.46శాతం మంది ఓటేశారు. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
* విజయవాడ సెంట్రల్- 72.96%
* విజయవాడ తూర్పు- 71.33%
* తిరువూరు- 87.68%
* నందిగామ- 87.56%
* మైలవరం- 85.36%

News May 15, 2024

ప్రత్యేక కమిటీలో కొల్లు రవీంద్ర

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు ఏడుగురు సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు కూడా స్థానం దక్కింది. జిల్లాకు చెందిన వర్ల రామయ్య కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

News May 15, 2024

విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు నేడు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నంకు నేడు ప్రత్యేక ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ ట్రైన్ (నం.08590) నేటి ఉదయం 10.30 నిముషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11.30కి విశాఖ చేరుకుంటుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ ట్రైన్ విజయవాడ, గుడివాడ, కైకలూరుతోపాటు ఏపీలోని ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.

error: Content is protected !!