India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సముద్రంలో మత్స్య సంపద సంతానోత్పత్తి నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఎటువంటి యాంత్రిక పడవల ద్వారా సముద్రంలో వేటకు వెళ్లరాదన్నారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఉద్విగ్నత కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో 1వ సంవత్సరం 24,557, 2వ సంవత్సరం 20,873 మంది మొత్తం 45వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయగా రాజబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు.
తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి మచిలీపట్నం, మే 14 నుంచి 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి స్పెషల్ రైలు నడవనుంది. ఈ రైలులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సూచించింది.
మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్చి నెల జరిగిన క్రైమ్ డిటెక్షన్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గంగాధరరావు రివార్డులు అందజేశారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, హెడ్ కానిస్టేబుల్ చంద్ర, కానిస్టేబుల్స్ బాజీ, మూర్తిలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు.
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెదపారుపూడి మండలం పాములపాడులోని గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయం భవనంలో రి సర్వేకు సంబంధించిన రికార్డులను ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. గ్రామ పరిధిలో ఇప్పటివరకు పూర్తి చేసిన రిసర్వే ప్రక్రియ తలెత్తిన సమస్యలపై కలెక్టర్ బాలాజీ ఆరాతీశారు.
☞ కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు: కలెక్టర్
☞ కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి
☞12 నుంచి తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తిరునాళ్లు
☞గుడివాడలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
☞ఇంతేరు సర్పంచి వైఖరిపై గ్రామస్థులు ఆగ్రహం
☞ పెనమలూరులో ముస్లింల నిరసన ర్యాలీ
☞ నాగాయలంకలో ఫుడ్ సేఫ్టీ అధికారి పేరుతో బెదిరింపులు.
గన్నవరం మండలం కేసరపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వడ్డెర కుటుంబానికి చెందిన లక్ష్మి(45) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం కేసరపల్లి చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ నెలకొల్పుటకు అనువైన స్థలాలను గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ MSME పార్కుల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.
మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకణ బుధవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన మూల్యాంకణ ప్రారంభమవ్వగా మొత్తం 1,89,852 సమాధాన పత్రాలను మూల్యాంకణ చేశారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు మూల్యాంకణ విధుల్లో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.