Krishna

News May 11, 2024

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాద.. మృతుడి వివరాలివే!

image

గోపాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద <<13228485>>మృతిని వివరాలను<<>> పోలీసులు వెళ్లడించారు. ఏ కొండూరు మండలం అట్లపడ గ్రామానికి చెందిన నల్లగట్ల అఖిల్‌ (24)గా గుర్తించారు. అఖిల్ తిరువూరు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఏ కొండూరు ఎస్సై చల్లా కృష్ణ తన సిబ్బందితో వెళ్లి వివరాలను సేకరించి, కేసు నమోదు చేశామన్నారు.

News May 11, 2024

ఉమ్మడి కృష్ణా: ప్రచారం CLOSE

image

ఎన్నికల క్రతువులో ముఖ్యఘట్టమైన ఎన్నికల ప్రచారం క్లోస్ అయింది. ప్రచార వాహనాలకు బ్రేక్ పడింది. సౌండ్ బాక్సుల మోతలు, డీజే శబ్దాలు ఆగిపోయాయి. చట్టసభల్లో అడుగుపెట్టేందుకు దాదాపు నెలరోజులుగా పోటీలో నిలిచిన నాయకులు నిత్యం ప్రజాక్షేత్రంలో ఓట్లు అభ్యర్థించగా.. హామీలు, విమర్శలు అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇకపై ఓటర్ అన్నదే ఫైనల్ తీర్పు మిగిలి ఉంది. ఓటు హక్కు వినియోగించుకుందాం.. సరైన నాయకుడిని ఎన్నుకుందాం.

News May 11, 2024

కృష్ణా: అభ్యర్థుల ప్రచారానికి సమయం ముగుస్తోంది

image

గత నెల రోజులుగా వివిధ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార పర్వాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మాత్రమే ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఈసీ ఆదేశాల ప్రకారం ప్రకారం.. నేటి సాయంత్రం 5 గంటలకే అభ్యర్థులు తమ, తమ ప్రచార పర్వాన్ని ముగించాలన్నారు. అందుకు సమయం ఆసన్నమైందని తెలిపారు. సమయానికి మించి ప్రచారం చేస్తే ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు అభ్యర్థులు బాధ్యులవుతారని హెచ్చరించారు.

News May 11, 2024

ఎన్టీఆర్ జిల్లాలో లారీ ఢీకొని.. వ్యక్తి మృతి

image

ఎన్టీఆర్ జిల్లాలోని ఎ కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. విజయవాడ- తిరువూరు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 11, 2024

కైకలూరు సిద్ధం సభకు వచ్చిన సీఎం జగన్

image

కైకలూరులో శనివారం నిర్వహిస్తున్న సిద్ధం సభకు సీఎం జగన్ మధ్యాహ్నం హెలికాప్టర్లో చేరుకొన్నారు.
భాష్యం స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో ఆయనకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ స్వాగతం పలికారు. జగన్‌ని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. తీన్మార్ డప్పులు, కళాకారులు చేసిన నృత్యాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

News May 11, 2024

మరి కాసేపట్లో కైకలూరుకి సీఎం జగన్

image

మరి కాసేపట్లలో సీఎం జగన్ కైకలూరుకి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చివరి రోజు కైకలూరులో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నాయి. సీఎం జగన్ రాకతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

News May 11, 2024

పమిడిముక్కలలో భారీగా మద్యం స్వాధీనం 

image

మండలంలోని వేల్పూర్ లో పెద్ద మొత్తంలో తరలిస్తున్న మద్యం వాహనాన్ని ఎస్ఈబి అధికారులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. సీఐ వెంకటలక్ష్మి, ఎస్సైలు దుర్గాప్రసాదరావు, సుబ్బారావు మద్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. వారు మాట్లాడతూ. రూ.11.50లక్షల విలువగల 5,937 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని చెప్పారు. 

News May 11, 2024

కంకిపాడులో యువతి ఆత్మహత్య

image

అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల మేరకు కంకిపాడు పులిరామారావు వీధికి చెందిన శ్రావ్య ఐదు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోందన్నారు. ఎన్ని మందులు వాడిన ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

News May 11, 2024

విజయవాడ: అన్న హ్యాట్రిక్‌ను తమ్ముడు అడ్డుకునేనా?

image

విజయవాడ పార్లమెంట్‌ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న అన్నదమ్ముల పోటిపై ఆసక్తి నెలకొంది. వైసీపీ నుంచి కేశినేని నాని, టీడీపీ నుంచి నాని తమ్ముడు కేశినేని చిన్ని బరిలోకి దిగుతున్నారు. 2014, 19లో టీడీపీ నుంచి గెలుపును సొంతం చేసుకున్న నాని ఈ సారి పార్టీ మారి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్ని, నాని హ్యాట్రిక్‌ను అడ్డుకుంటారా, మీ అభిప్రాయం కామెంట్‌ చేయండి.

News May 11, 2024

మే 13న ఎన్నికలు.. తరలివస్తున్న ఓటర్లు

image

మే 13న జరిగే ఎన్నికల నేపథ్యంలో దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ స్వస్థలాలకు చేరుకొంటున్నారు. ఉద్యోగ, వ్యాపారరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఉత్సాహంగా తమ ఊర్లకి తరలివస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చే వారు అధికంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే బస్సు సర్వీసులన్ని కిటకిటలాడుతున్నాయి. దీంతో అధికారులు అదనంగా 225 బస్సులను నడుపుతున్నారు.

error: Content is protected !!