Krishna

News May 11, 2024

కృష్ణా: ఓటర్లకు ప్రలోభాలు.?

image

మరికొన్ని గంటల్లో కృష్ణా జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. విజయవాడ తూర్పులో ఓటుకు రూ.1,500, సెంట్రల్‌లో రూ.2వేలు, నందిగామ, జగ్గయ్యపేటల్లో పరిస్థితిని బట్టి రూ.1500 నుంచి రూ.2వేలు, గుడివాడ, పెనమలూరులో రూ.2వేలు పంచుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. రెండోసారి పంపిణీకి సిద్ధమవుతున్నారు.

News May 11, 2024

NTR: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి జైలు శిక్ష ఖరారు

image

విజయవాడలోని ఓ కళాశాలలో చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో తానికొండ పవన్ అనే యువకుడికి న్యాయస్థానం శుక్రవారం 10ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. సదరు బాలిక(16)ను 2016లో నిందితుడు పవన్(19) అత్యాచారం చేయగా సూర్యారావుపేట PSలో కేసు నమోదు కాగా, కేసు విచారించిన పోక్సో కోర్ట్ జడ్జి తిరుమల వెంకటేశ్వర్లు శుక్రవారం నిందితుడు పవన్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

News May 11, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలి: డీకే బాలాజీ

image

జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, వీఆర్వోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలింగ్ సజావుగా జరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు.

News May 10, 2024

ఘంటసాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని దాలిపర్రు గ్రామ శివారులో ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఘంటసాల గ్రామం దిరిశం వాని గూడెంకు చెందిన కొక్కిలిగడ్డ ఇస్సాకు మృతిచెందాడు. మచిలీపట్నం నుంచి ఘంటసాల వస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆటోలో నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఘటనపై ఎస్సై ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 10, 2024

కృష్ణా: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ గౌరీ మణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 08674-295953, 8555 952320 నెంబర్లను సంప్రదించాలన్నారు.

News May 10, 2024

కృష్ణా: కృష్ణప్రసాద్‌లకు విజయం దక్కేనా

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన, మైలవరంలలో కృష్ణప్రసాద్ కాగిత, కృష్ణప్రసాద్ వసంత టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో దేవినేని ఉమాపై విజయం సాధించిన వసంత ఇటీవల పార్టీ మారి మైలవరం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో టీడీపీ తరఫున పెడన నుంచి బరిలోకి దిగిన కాగిత గెలుపు చవిచూడలేదు. తాజాగా పెడన నుంచి కాగిత, మైలవరంలలో వసంత బరిలోకి దిగుతుండగా ఓటర్లు వీరిని కరుణిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

News May 10, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల సౌలభ్యం కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.17239 గుంటూరు- విశాఖపట్నం(మే 11 నుంచి 13), నం.17240 విశాఖ- గుంటూరు(మే 12 నుంచి 14) ట్రైన్‌కు ఒక ఛైర్ కార్ కోచ్ అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అదనపు బోగీ ద్వారా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి బెర్తులు లభిస్తాయన్నారు.

News May 10, 2024

కృష్ణా: 50% పైబడి ఓట్లు సాధించింది వీరే..

image

2019 ఎన్నికలలో ఉమ్మడి కృష్ణాలోని పలు స్థానాల్లో పోలైన ఓట్లలో 50% పైబడి ఓట్లు సాధించిన పలువురు నేతలు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించారు. కొడాలి నాని (గుడివాడ)- 53.5% రక్షణనిధి (తిరువూరు)- 50.73%, ఎం.అప్పారావు(నూజివీడు)- 50.84%, కైలే అనిల్(పామర్రు)- 56.15%, మొండితోక జగన్(నందిగామ)- 51.32% ఓట్లు సాధించారు. కాగా, వీరిలో కొడాలికి జగన్ కేబినెట్‌గా పౌరసరఫరాల శాఖ మంత్రిగా చోటు దక్కింది.

News May 10, 2024

అమరావతి కోసమే పశ్చిమ సీటు త్యాగం చేశాం: పవన్

image

రాజధాని అమరావతి మనుగడ కోసమే విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి త్యాగం చేశానని గురువారం జరిగిన రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అంశంపై పవన్ మాట్లాడుతూ.. తొలుత పశ్చిమ సీటు జనసేనకు ఖాయమైందని, బీజేపీ అగ్రనేతలు అమరావతిలో తమ ప్రాధాన్యం కోసం ఈ స్థానం అడగడం వల్ల ఇచ్చానన్నారు. పశ్చిమ స్థానం బీజేపీకి ఇచ్చినప్పుడు.. అమరావతి, రాష్ట్ర భవిష్యత్ కాపాడాలని బీజేపీ అగ్రనేతలను కోరానన్నారు.

News May 10, 2024

NTR: 50% పైబడి ఓట్లు సాధించి నేడు పోటీకి దూరంగా..

image

2014, 2019లో తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున గెలిచిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తాజా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన పోలైన ఓట్లలో 50.73% ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి KS జవహర్‌పై 10,835 ఓట్ల మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో రక్షణనిధిని కాదని, వైసీపీ నల్లగట్ల స్వామిదాసుకు టికెట్ ఇవ్వడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. 

error: Content is protected !!