Krishna

News May 15, 2024

ప్రత్యేక కమిటీలో కొల్లు రవీంద్ర

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్లలో జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడేందుకు చంద్రబాబు ఏడుగురు సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రకు కూడా స్థానం దక్కింది. జిల్లాకు చెందిన వర్ల రామయ్య కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

News May 15, 2024

విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు నేడు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నంకు నేడు ప్రత్యేక ట్రైన్ నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే ఈ ట్రైన్ (నం.08590) నేటి ఉదయం 10.30 నిముషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11.30కి విశాఖ చేరుకుంటుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ ట్రైన్ విజయవాడ, గుడివాడ, కైకలూరుతోపాటు ఏపీలోని ఇతర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందన్నారు.

News May 15, 2024

కృష్ణా: జిల్లాలో స్వల్పంగా పెరిగిన పోలింగ్ శాతం

image

జిల్లాలో పోలింగ్ శాతం 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో స్వల్పంగా పెరిగింది. 2019లో 84.36 శాతం ఓట్లు పోలవ్వగా ఈ ఎన్నికల్లో 84.45% మేర పోలయ్యాయి. 0.9% మేర మాత్రమే పోలింగ్ శాతం పెరిగింది. జిల్లాలో మొత్తం 1,96,680 మంది ఓటర్లకు గాను 1,61,109 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. 

News May 14, 2024

కృష్ణా: రిజర్వ్‌డ్ స్థానాల్లో పోటెత్తిన ఓటర్లు 

image

ఉమ్మడి కృష్ణాలోని SC రిజర్వ్డ్ స్థానాలైన తిరువూరు, నందిగామ, పామర్రులో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. నందిగామ86.50%, తిరువూరు85.68%, పామర్రులో87.11% శాతం పోలింగ్ జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఎన్నికల్లో మాదిరిగా ఈ స్థానాల్లో ఓటర్లు తమకే పట్టం కట్టారని వైసీపీ శ్రేణులు చెబుతుండగా, ఈ 3 నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగరనుందని టీడీపీ కూటమి నేతలు చెబుతున్నారు. జూన్ 4న ఓటర్ల తీర్పు తెలియనుంది.

News May 14, 2024

కృష్ణా: మందకొడిగా సాగుతున్న రేషన్ బియ్యం పంపిణీ

image

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మే నెలకు సంబంధించి రేషన్ బియ్యం పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ నెల 14వరకూ ఎన్టీఆర్ జిల్లాలో 82.59%, కృష్ణాలో 80.20% మేర రేషన్ పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. రేషన్ పంపిణీలో జిల్లాలవారీగా ఎన్టీఆర్ 14వ, కృష్ణా 21వ స్థానంలో ఉన్నాయి. కాగా జిల్లాలోని పలు ప్రాంతాలలో తమకు రేషన్ త్వరగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

News May 14, 2024

కృష్ణాజిల్లాలో 84.45% మేర పోలింగ్

image

* గన్నవరంలో 2,79,054 మందికి 2,36,848 (84.88%)
* గుడివాడలో 2,04,271 మందికి 1,68,537, (82.51%)
* పెడనలో 1,67,564 మందికి 1,48,413 (88.57%) (అత్యధికం)
* మచిలీపట్నంలో 1,96,680 మందికి 1,61,109 (81.91%)
* అవనిగడ్డలో 2,12,331 మందికి 1,82,600 (86.00%)
* పామర్రులో 1,84,632 మందికి 1,62,683 (88.11%)
* పెనమలూరులో 2,94,828 మందికి 2,33,413 (79.14%) (అత్యల్పం)

News May 14, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

విజయవాడ మీదుగా వెళ్లే తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) కృష్ణా ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని రైల్వే అధికారులు మార్పులు చేశారు. ట్రాక్ నిర్వహణ కారణాల రీత్యా నం.17405 TPTY-ADB ట్రైన్‌ను ఈ నెల 16, 22 తేదీల్లో, నం.17406 ADB-TPTY ట్రైన్‌ను ఈ నెల 15, 21 తేదీల్లో విజయవాడ మీదుగా నడపమని అధికారులు తెలిపారు. విజయవాడ, మధిర, ఖమ్మం మీదుగా కాక తెనాలి, సికింద్రాబాద్ మీదుగా ఆయా తేదీల్లో ఈ రైళ్లు నడుపుతామన్నారు. 

News May 14, 2024

కృష్ణా: బీఈడీ కోర్సు అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా వర్శిటీ పరిధిలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ కోర్సు అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2024 జూలై, నవంబర్ నెలల్లో బీఈడీ విద్యార్థులకు మొదటి, రెండో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయంది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News May 14, 2024

కృష్ణా: ఆ నియోజకవర్గంలో జనసేనకు పట్టు చిక్కినట్లేనా..

image

ఉమ్మడి కృష్ణాలో అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో ఇక్కడ NDA కూటమి శ్రేణులు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే అవనిగడ్డలో కూటమి అభ్యర్థులైన బాలశౌరి, బుద్ధప్రసాద్ ఎన్నికల గుర్తు ఒకటే కావడంతో తమకు భారీ స్థాయిలో ఓట్లు పోలయ్యాయని కూటమి శ్రేణులు భావిస్తుండగా, జూన్ 4న ఈ ప్రశ్నకు సమాధానం లభించనుంది.  

News May 14, 2024

మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో పోలింగ్ అనంతరం ఈవీఎంలను కృష్ణా విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు. మూడంచెల భద్రత నడుమ ఈవీఎంలను భద్రపరిచినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచామని కలెక్టర్ పేర్కొన్నారు.