Krishna

News May 9, 2024

విజయవాడలో మోదీ రోడ్ షో సూపర్ సక్సెస్: TDP

image

ప్రధాని మోదీ విజయవాడలో నిర్వహించిన రోడ్ షో సూపర్ సక్సెస్ అయిందని TDP తెలిపింది. ఇది నవ్యాంధ్ర నవశకానికి నాంది అని ట్వీట్ చేసింది. మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షోకు ప్రజలు భారీగా హాజరై బ్రహ్మరథం పట్టారని తెలిపింది. పీవీఆర్ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముగ్గురూ ముచ్చటిస్తూ కనిపించారు. పలుమార్లు మోదీ, చంద్రబాబు, పవన్ మధ్య నవ్వులు పూశాయి.

News May 9, 2024

కృష్ణా: పోస్టల్ బ్యాలెట్‌కు మరో అవకాశం

image

ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్ఓ కార్యాలయాల్లో పోలీస్ సిబ్బంది కోసం ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోని వారి కోసం ఈ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News May 8, 2024

కామినేని తరఫున సినీ హీరో వెంకటేష్ ప్రచారం

image

కైకలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తరఫున సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం సాయంత్రం కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కైకలూరు అభివృద్ధి చెందాలంటే కామినేని శ్రీనివాస్‌తోనే సాధ్యమని ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వెంకటేష్ కోరారు.

News May 8, 2024

కృష్ణా: ‘ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి’

image

13వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు 12,13 తేదీల్లో ప్రింట్ మీడియాలో అభ్యర్థుల ప్రచార ప్రకటనలకు విధిగా MCMC కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలియజేశారు. అభ్యర్థులతోపాటు మీడియా యాజమాన్యాలు కూడా MCMC నుంచి అనుమతులు తీసుకోవాలని వెల్లడించారు.

News May 8, 2024

కంచికచర్ల: క్వారీ గుంతలో పడి ఇద్దరు మహిళలు మృతి

image

కంచికచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. దోనబండ క్వారీలో ఉన్న నీటి గుంతలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఒడిశాకు చెందిన అక్కాచెల్లెళ్లు క్వారీ వద్ద బట్టలు ఉతుకుతుండగా వారిలో ఒకరు కాలు జారి పడిపోయారు. ఆమెను కాపాడబోయి మరో మహిళ గుంతలో పడిపోయింది. ఆపై ఊపిరాడక వారిద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

News May 8, 2024

నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు (1/3)

image

విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. * RTC వై జంక్షన్‌ – బెంజిసర్కిల్‌ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు అనుమతించరు. * ఎంజీ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను ఏలూరు రోడ్డు, 5వ నంబర్‌ రూట్‌కు మళ్లిస్తారు. * ఆటోనగర్‌ వైపు నుంచి బస్టాండ్‌ వెళ్లే వాహనాలు ఆటోనగర్‌ గేటు, పటమట, కృష్ణవేణి స్కూల్‌ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా ప్రయాణించాలి.

News May 8, 2024

విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు.. (2/3)

image

మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* మచిలీపట్నం- విజయవాడ మధ్య తిరిగే బస్సులు ఆటోనగర్‌ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్‌, పడవల రేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్‌, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్‌లో వెళతాయి. * ఏలూరు- విజయవాడ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్‌, పడవలరేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్‌, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్‌లో వెళతాయి.

News May 8, 2024

విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు.. (3/3)

image

మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* వైజాగ్ – హైదరాబాద్‌ మధ్య <<13204421>>రాకపోకలు<<>> సాగించే భారీ వాహనాలు హనుమాన్‌ జంక్షన్‌, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం రూట్‌లో వెళ్లాలి.
* వైజాగ్- చెన్నై మధ్య ప్రయాణించే భారీ వాహనాలు హనుమాన్‌జంక్షన్‌, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, పులిగడ్డ, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట మార్గంలో వెళ్లాలి.

News May 8, 2024

నేడు కైకలూరులో సినీ హీరో వెంకటేష్ ప్రచారం

image

కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. బుధవారం కలిదిండి మండలం కోరుమల్లులో సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతందన్నారు. వేమవరప్పాడు, తామరకొల్లు, వింజరం, ఆచవరం గ్రామాల మీదుగా కైకులూరుకు చేరుకుని హీరో వెంకటేష్ అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లడతారన్నారు. కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News May 8, 2024

మోదీ టూర్.. ట్రాఫిక్ మళ్లింపు

image

విజయవాడలో మోదీ టూర్ సందర్భంగా.. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ మళ్లించారు. బుడంపాడు అండర్‌ పాస్‌ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, భట్టిప్రోలు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్‌ జంక్షన్‌ దగ్గర్లోని NH16 వైపు వెళ్లాలి. GNT నుంచి HYD వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణించాలి.

error: Content is protected !!