Krishna

News May 25, 2024

కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

image

మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీ శనివారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. అనుమతి లేని వాహనాలను, వ్యక్తులను కౌంటింగ్ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రతిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News May 25, 2024

కృష్ణా: కౌంటింగ్ మాక్ డ్రిల్ పరిశీలించిన కలెక్టర్ బాలాజీ

image

మచిలీపట్నంలో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బాలాజీ అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ ఏ విధంగా నిర్వహించాలి అనే విషయంపై అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. అధికారులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించాలని తెలియజేశారు.

News May 25, 2024

కృష్ణా: డీవైఈఓ స్క్రీనింగ్ టెస్ట్‌కు 1434 మంది హాజరు

image

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కృష్ణాజిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 8 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా 2,370 మంది అభ్యర్థులకు గాను 1434 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 936 మంది గైర్హాజరయ్యారని, హాజరు శాతం 61% గా నమోదైందన్నారు. 

News May 25, 2024

కృష్ణా: ‘ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం’

image

జూన్ 4వ తేదీ ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కృష్ణా విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు.

News May 25, 2024

కృష్ణా: SSC విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే SSC సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు APOSS పరీక్షల టైంటేబుల్ విడుదలైంది.
జూన్ 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.

News May 25, 2024

కృష్ణా: టిప్పర్‌ను ఢీకొన్న ఆటో.. మహిళ మృతి

image

ఏలూరు జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్‌‌ను ఆటో ఢీకొట్టగా.. ఆ ఆటోలో ఉన్న బొర్రా కుమారి(50) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇతర వాహనదారులు క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కుమారి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన మహిళగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 25, 2024

కృష్ణా: మత్స్యకారులకు కీలక హెచ్చరికలు

image

తూర్పు మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, ఇది సాయంత్రానికి తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. తుఫాను కారణంగా సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని APSDMA అధికారులు హెచ్చరించారు. మే 26వ తేదీ రాత్రికి ఈ తుఫాన్ బంగ్లాదేశ్& పశ్చిమ బెంగాల్‌ మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని APSDMA స్పష్టం చేసింది.

News May 25, 2024

నూజివీడు: ఒకే పార్టీ నుంచి 5 సార్లు వరుసగా MLA

image

నూజివీడు సంస్థానంలో నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డ్ సృష్టించిన ఘనత డాక్టర్ ఎంఆర్ అప్పారావుకు దక్కుతుంది. నియోజకవర్గంలో 1952, 55, 62, 67, 72లలో ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేదు. కోటగిరి హనుమంతరావు 4 సార్లు, సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ మూడు సార్లు గెలుపొందారు.

News May 25, 2024

కైకలూరులో చెక్కు చెదరని కనుమూరి బాపి రాజు రికార్డు

image

మీసాల రాజుగా పేరొందిన కనుమూరి బాపి రాజుకు కైకలూరు ఎన్నికలలో అరుదైన రికార్డ్ ఉంది. కైకలూరు ఎమ్మెల్యేగా వరుసగా 4 సార్లు ఒకే పార్టీ నుంచి ఎన్నికై ఆయన అరుదైన రికార్డ్ సృష్టించారు. 1978, 83, 85, 89 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. టీడీపీ ప్రభంజనాన్ని సైతం ఎదురొడ్డి 1983, 85లో బాపిరాజు కైకలూరులో విజేతగా నిలవడం విశేషం.

News May 25, 2024

కృష్ణా: అడ్మిషన్లకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిపోయిన సీట్లను అర్హులైన విద్యార్థులతో భర్తీ చేస్తామని పాఠశాలల DCO సుమిత్రాదేవి తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష రాసి 5వ తరగతిలో సీటు పొందలేకపోయిన విద్యార్థులకు ఈ నెల 28న కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అడ్మిషన్ కావాల్సిన విద్యార్థులు సంబంధిత పాఠశాలలలో సంప్రదించాలని కోరుతూ సుమిత్రాదేవి తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.