Krishna

News May 25, 2024

విజయవాడ: బాడీ మసాజ్ కేంద్రంపై పోలీసులు దాడి

image

విజయవాడ సిద్ధార్థ నగర్‌లో బాడీ స్పా నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్ పై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ గుణరామ్ తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధార్థ నగర్‌లో బ్యూటీ పార్లర్ పేరుతో బాడీ మసాజ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఈ దాడిలో ముగ్గురు యువతులను, ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News May 25, 2024

ఓట్ల లెక్కింపుకు అధికారులంతా సంసిద్ధం కావాలి: డీకే బాలాజీ

image

జూన్ 4న కృష్ణా వర్సిటీలో జరిగే ఓట్ల లెక్కింపుకు అధికారులంతా పూర్తి అవగాహనతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఓట్ల లెక్కింపుపై ఆర్వోలు, ఏఆర్వోలకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. 

News May 24, 2024

కృష్ణా జిల్లాకు రేపు వర్ష సూచన

image

కృష్ణా జిల్లా పరిధిలో శనివారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని APSDMA స్పష్టం చేసింది.

News May 24, 2024

కౌంటింగ్‌కు రాజకీయ పార్టీల శ్రేణులు సహకరించాలి: ఢిల్లీరావు

image

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయడంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల శ్రేణులు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలెక్టరేట్లో నేడు ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ శ్రేణులకు ఈవీఎంలో నమోదైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించే విధానంలో వివిధ దశలను క్షుణ్నంగా వివరించినట్లు కలెక్టర్ తెలిపారు.

News May 24, 2024

లోకేశ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిమాండ్.. మీ COMMENT.!

image

నారా లోకేశ్‌కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే, లోకేశ్‌‌ను అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎలాగూ కేబినెట్‌లోకి తీసుకుంటారని, దీంతో ఎటువంటి వివాదాలు ఉండవన్నారు. ఈ క్రమంలో లోకేశ్‌కు అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలనే వ్యాఖ్యలపై మీ కామెంట్.

News May 24, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్..పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని పీజీ- మాస్టర్ ఆఫ్ లా(LLM) కోర్స్ 3వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 24, 2024

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06271 SMVB- BBS రైలును ఈ నెల 31న, నం.06272 BBS- SMVB రైలును జూన్ 2వ తేదీన నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 24, 2024

జయ బాడిగకు అభినందనలు తెలిపిన చంద్రబాబు

image

కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా జయ బాడిగ ఇటివల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు X వేదికగా అభినందనలు తెలిపారు. జయ బాడిగ విజయవాడకు చెందిన వారు కావడం గర్వకారణమని అన్నారు. ఆమె పదవి కాలాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని అన్నారు.

News May 24, 2024

విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

కృష్ణా నది వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని వన్ టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి తెలిపారు. కృష్ణానది వద్ద స్థానికులు గుర్తుతెలియని మృతదేహం ఉందన్న ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా 50 సంవత్సరాల వ్యక్తి గల మృతదేహం లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసిన యెడల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News May 24, 2024

కృష్ణా: తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్‌కోయిల్ (NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 06105 NCJ- DBRG రైలును జూన్ 14,21,28 తేదీలలో, నం.06106 DBRG- NCJ రైలును జూన్ 19, 26, జులై 3వ తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.