India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లాలో తొలి రోజు 3361 మంది పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 3,728 మందికి గానూ సాయంత్రం 5 గంటలకు వరకు అందిన సమాచారం మేరకు 3,361 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. గన్నవరంలో 299, గుడివాడలో 490, పెడనలో 212, మచిలీపట్నంలో 783, అవనిగడ్డలో 843, పామర్రులో 246, పెనమలూరులో 488 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు.
మచిలీపట్నం కూటమి MP, MLA అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రపై వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా వారిద్దరూ ఈ నెల 2న మచిలీపట్నం పోలీస్ స్టేషన్, జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్ద వందలాది మంది కార్యకర్తలతో ధర్నా చేసిన దానిపై ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి ఇరువురిపై చర్యలు తీసుకోవాలన్నారు.
విజయవాడలో లోన్ యాప్‌కి మరో యువకుడు బలయ్యాడు. కటికలేటి చందు అనే యువకుడు లోను యాప్ సిబ్బంది వేధింపులు భరించలేక శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మాచవరం పోలీసులు మీడియాకు వెల్లడించారు.
విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటుపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్కూటీపై వెళుతున్న విజయవాడకు చెందిన ప్రసాద్(70)ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడగా గమనించిని స్థానికులు వెంటనే అతనిని విజయవాడ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలిచారు.. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు గుడివాడ నియోజకవర్గంలోని నెహ్రూ చౌక్‌లో ఉదయం 11 గంటలకు రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్ లేని ప్రయాణికుల వద్ద నుంచి ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో రూ.7.96కోట్ల ఆదాయం డివజన్‌కు లభించింది. వివిధ రైళ్లు, స్టేషన్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 44,249 మందిపై కేసులు నమోదు చేసి రూ.4.25కోట్లు, అక్రమ రవాణాపై 51,271 కేసులు నమోదు చేసి రూ.2.79కోట్లు, ఇతర కేసుల ద్వారా రూ.92 లక్షలు వసూలు చేసినట్లు రైల్వే అధికారి నరేంద్ర అనందరావు తెలిపారు.
ఈ నెల 13వ తేదీన జిల్లాలో పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో 48 గంటల ముందు 11వ తేదీ నుంచి సెక్షన్ 144 అమలు చేస్తూ కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ఎక్కడా కూడా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా ఉండకూడదన్నారు. అలాగే బహిరంగ సభలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. పోలింగ్ ముగిసే వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.
జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి కేసులో నిందితులుగా పేర్కొన్న ఐదుగురికి సెల్ఫ్ బెయిల్ మంజూరైంది. ఈ కేసులో YCP నేతలు చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేశ్‌లపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిందితులకు సెల్ఫ్ బెయిల్ మంజూరు చేశారు. కాగా ఇదే కేసులో వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుని A1గా చూపారు.
జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు అందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సులభతరంగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్‌కు 48 గంటల ముందు జిల్లాలోని అన్ని మద్యం షాపులు మూసి వేయాలని, కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు రోజు అనగా జూన్ 4వ తేదీకి 48 గంటలు ముందు ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశాల వద్ద డ్రై డే గా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు పటిష్ఠంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.