India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అల్పపీడన ప్రభావంతో రేపు గురువారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. జిల్లాలోని పలు మండలాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి. అటు పొరుగున ఉన్న ఏలూరు జిల్లాలో సైతం వర్షాలు పడతాయని APSDMA హెచ్చరించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06089 తాంబరం- సత్రాగచ్చి ట్రైన్‌ను జూన్ 5 నుంచి జూలై 3 వరకూ ప్రతి బుధవారం, నెం.06090 సత్రాగచ్చి- తాంబరం ట్రైన్‌ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
విజయవాడ నుంచి భద్రాచలం రోడ్ వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్‌లను నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు నైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 30వరకు నం.07278 భద్రాచలం రోడ్- విజయవాడ, నం.07979 విజయవాడ- భద్రాచలం రోడ్ మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించుటకు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లాలో వివిధ శాఖల (రవాణా, పరిశ్రమలు, ఏ.పీ.ఐ.ఐ.సీ, పర్యాటక, కార్మిక, చేనేత, కాలుష్య నియంత్రణ) ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
విజయవాడ నుంచి బిట్రగుంట వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్‌లను నిర్వహణ కారణాల వల్ల కొద్ది రోజుల పాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి జూన్ 23 వరకు నం.07977 బిట్రగుంట- విజయవాడ, నం.07978 విజయవాడ- బిట్రగుంట మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని సూచించింది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(PGECET)-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఉన్నత విద్యామండలి తెలిపింది. కాగా PGECET పరీక్షను ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహిస్తామని APSCHE వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సంబల్‌పూర్(SMP), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 23 నుంచి జూన్ 27 వరకు ప్రతి గురువారం SMP- SMVB(నం.08321), మే 25 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం SMVB- SMP(నం.08322) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, పార్వతీపురంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
పోలింగ్ అనంతరం చెలరేగిన హింసలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు ముందస్తు భద్రత చర్యలలో భాగంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని అవనిగడ్డ, పెడన, వివిధ నియోజకర్గాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి తనిఖీలు చేశారు. కౌటింగ్ నేపథ్యంలో ఎవరూ అల్లర్లు, గొడలు సృష్టించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీలో భారత క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ర్యాంకింగ్ రౌండ్‌లో నాలుగో స్థానం సాధించింది. గతనెల షాంఘైలో స్టేజ్-1 టోర్నీలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన సురేఖకు మహిళల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్‌లో టాప్-3లో స్థానం కొద్దిలో చేజారింది. సురేఖ ప్రదర్శనతో టీమ్ విభాగంలో భారత్‌కు రెండో సీడింగ్ లభించింది. కాగా సురేఖ విజయవాడకు చెందిన క్రీడాకారిణి కావడం విశేషం.
భారతీయ వైమానికదళం అగ్నివీర్ వాయు ‘సంగీతకారుల కోసం’ రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు, జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. ఆసక్తి గల అవివాహితులైన పురుషులు, మహిళలు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. 10వ తరగతి చదివి ఆసక్తి కలిగిన యువతీ, యువకులు నేటి నుంచి https:///agnipathvayu.cdac.in వెబ్ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.