India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నందివాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పవన్ కుమార్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి మోసం చేసిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. 8 నెలలుగా తనను బెదిరించి అత్యాచారం చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి చింతపల్లి మనోహర్‌కు గాజు గ్లాసును పోలిన గుర్తును కేటాయించారు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం అసెంబ్లీ బరిలో 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారిణి వాణి తెలిపారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వారి వారి పార్టీ సింబల్స్ కేటాయించామన్నారు. ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులకు కూడా సింబల్స్ కేటాయించామని చెప్పారు.
కృష్ణా జిల్లాలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం 94 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు 15 మంది పోటీలో నిలవగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 79 మంది పోటీలో నిలిచారు. గన్నవరం అసెంబ్లీకి 12, గుడివాడకు 12, పెడనకు 10, మచిలీపట్నంకు 10, అవనిగడ్డకు 12, పామర్రుకు 08, పెనమలూరుకు 11 మంది పోటీలో నిలిచారు.
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల అనంతరం మచిలీపట్నం పార్లమెంట్ బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 25 మంది పోటీలో నిలువగా వారిలో 10 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. YCP అభ్యర్థిగా డా. సింహాద్రి చంద్రశేఖర్, జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ, తదితరులు పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
గన్నవరంలో నామినేషన్ విత్డ్రా అనంతరం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రాఘవేంద్రరావు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యార్లగడ్డ వెంకట్రావుకి రంగా, పవన్ కళ్యాణ్ అంటే కనీస గౌరవం లేదన్నారు. తనను నియోజకవర్గంలో నిలబెట్టి వంశీని ఓడించాలని చూశారని అన్నారు. ఆఫీసులో కనీసం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టుకోలేదని, నియోజకవర్గంలో కాపులందరూ వంశీకి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
నూజివీడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర రావు సోమవారం తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. త్వరలో ముద్దరబోయిన దంపతులు చంద్రబాబును కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
గుడివాడ నియోజకవర్గంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు MLAలుగా పనిచేశారు. 1994 సాధారణ ఎన్నికలలో TDPఅభ్యర్థిగా రావి శోభనాద్రి గెలుపొందారు. 1999లో రావి హరిగోపాల్ TDPతరఫున గెలిచి ప్రమాణస్వీకారం చేయకుండానే రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన సోదరుడు రావి వెంకటేశ్వరరావు 2000లో జరిగిన ఉప ఎన్నికలలో గెలిచారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఒకే నియోజకవర్గంలో MLAలు కావడం విశేషం.
దేశంలోనే ధనిక MP (గుంటూరు) అభ్యర్థిగా బరిలోకి దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ కంకిపాడు మండలం గొడవర్రుకు చెందిన అల్లుడు అని స్థానిక వాసులు తెలిపారు. గొడవర్రుకు చెందిన కోనేరు రత్నశ్రీ, చంద్రశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో వీరి పరిచయం ప్రేమ, తర్వాత ‘పెళ్లి’కి దారితీసింది. గొడవర్రులో రెండున్నర ఎకరాల పొలం ఉన్నట్టు ఆయన ఇటీవల నామినేషన్‌లో చూపించారు.
రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ ఛైర్మన్, వైసీపీ యువజన అధ్యక్షుడులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నేడు కైకలూరులో పర్యటనించనున్నారు. ఆయన కైకలూరులోని ఏలూరు రోడ్‌లో వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి సీతారామ కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే DNR, MLC జయమంగళ, వైసీపీ నేత బీవీ రావు, పార్టీ శ్రేణులు పాల్గొంటారన్నారు.
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. కాటూరు నరేంద్ర(36)కృష్ణలంక గుంటూరి వారి వీధిలో ఉంటూ లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేస్తాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు, భార్య నగరంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తుందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శనివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో నరేంద్ర ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.