India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో మహిళా సంక్షేమానికి రూ.4,392 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు జరిపామన్నారు. శనివారం స్థానిక జడ్పీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు గాను జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ (RWS) కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు RWS SE శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే 08672-223522 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయవచ్చని అన్నారు.
మెగా DSC రిక్రూట్మెంట్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి రమేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈనెల 10వ తేదీలోపు మచిలీపట్నంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని మిత్రులు, వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్‌లకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని 1టౌన్ సీఐ శ్రీనివాస్, 2టౌన్ సీఐ దుర్గాప్రసాద్‌లు తెలిపారు. 2024లో వాలంటీర్లు, ఆటోనగర్‌లోని లిక్కర్ గోడౌన్ విషయంలో నమోదైన కేసులలో కొడాలి, దుక్కిపాటి, పాలడుగు, గొర్ల శీను తదితరులపై నమోదైన కేసులో పలువురికి 41ఏ నోటీసులు అందజేశారన్న వార్తలను సీఐలు ఖండించారు.
కృష్ణా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వై.హరినాథ్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. హరినాథ్ బాబు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కృష్ణాజిల్లా డీఆర్డీఏ పీడీగా బదిలీపై వచ్చారు.
అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంకలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గ్రామ సచివాలయంలో రికార్డులు పరిశీలించి అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూమి నిజనిర్ధారణ (గ్రౌండ్ ట్రూతింగ్), భూమి ధ్రువీకరణ (గ్రౌండ్ వాలిడేషన్) ప్రక్రియ సక్రమంగా జరిగితే రీ సర్వేలో నాణ్యమైన ఫలితాలు పొందవచ్చన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనుకు గుడివాడ పోలీసులు శుక్రవారం 41ఏ నోటీసులు ఇచ్చారు. వాలంటీర్ల బలవంతపు రాజీనామా, లిక్కర్ గోదాం కేసుల్లో వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో కొడాలి నాని, మాజీ బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జె.సి. మాధవీలతారెడ్డి సహా పలువురిపై కేసు నమోదైంది.
RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు గన్నవరం, పెనమలూరు నుంచి ఎక్కువగా విజయవాడకు వస్తుంటారు. విజయవాడలో కాలేజీలు కూడా ఉండటంతో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విజయవాడ వెళ్లాలంటే టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
తోట్లవల్లూరులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులకు వివరాల మేరకు.. మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లెంవారిపాలెం వద్ద కృష్ణానది ఒడ్డున ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి ఎడమ చేతి మీద డిజైన్, బ్రూస్‌లీ అని, కుడి చేతి మీద నాయక్, ప్రేమ కావాలి, కాజల్, అమ్మానాన్న, గంగా అని చాతిపైన పోలమ్మ, కాజల్, బసవమ్మ అని పచ్చబొట్టులు ఉన్నాయి.VRO ఫిర్యాదతో SI కేసు నమోదు చేశారు.
★ గన్నవరంలో వాయిదా పడిన పవన్ పర్యటన ★ కృష్ణా జిల్లాలో 40 డిగ్రీలు ఎండ★ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 సర్వే : కలెక్టర్ ★ మొవ్వ: రాజీకి పిలిచి.. హత్య ★ VJA: `సాఫ్వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’★ గన్నవరం: తీవ్రమవుతున్న వెటర్నరీ విద్యార్థులు నిరసనలు★ గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి★ ఉయ్యూరు: ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ నోట్
Sorry, no posts matched your criteria.