Krishna

News June 4, 2024

కృష్ణా: చంద్రబాబు ఇంటికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఆయనకు భారీ భద్రత కల్పించేలా అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రస్తుతం 155 స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి, చంద్రబాబు నివాసానికి టీడీపీ కూటమి శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి.

News June 4, 2024

విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఆధిక్యం

image

విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి షేక్ ఆసిఫ్‌సై 5149 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

విజయవాడ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆధిక్యం

image

విజయవాడ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి దేవినేని అవినాశ్‌పై 18911 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

ఉమ్మడి కృష్ణాలో దూసుకెళ్తున్న టీడీపీ కూటమి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేవలం నూజివీడులో మాత్రమే ప్రస్తుతానికి వైసీపీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఉమ్మడి కృష్ణాలో టీడీపీ, జనసేన, BJP శ్రేణులు భారీ స్థాయిలో సంబరాలకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో కార్యాలయాల వద్దకు భారీగా ఆ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు.

News June 4, 2024

మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధిక్యం

image

మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి పేర్ని కిట్టుపై 1979 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

పామర్రులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఆధిక్యం

image

పామర్రులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కైలే అనీల్ పై 2403 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ముందంజ

image

విజయవాడ పార్లమెంట్ తొలి రౌండ్‌‌లో విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) 13 వేల ఓట్ల ఆధిక్యంలో తన సమీప ప్రత్యర్థి కేశినేని నానిపై ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆధిక్యంలో ఉన్నది వీరే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కింది స్థానాల్లో తొలి రౌండ్లలో NDA కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారని సమాచారం వెలువడింది.
తిరువూరు- కొలికపూడి శ్రీనివాస్(టీడీపీ)
గుడివాడ- వెనిగండ్ల రాము(టీడీపీ)
మచిలీపట్నం- కొల్లు రవీంద్ర(టీడీపీ)
విజయవాడ పశ్చిమ- సుజనా చౌదరి(బిజెపి)
విజయవాడ సెంట్రల్- బొండా ఉమ(టీడీపీ)

News June 4, 2024

విజయవాడ పార్లమెంట్‌లో కేశినేని చిన్ని ముందంజ

image

విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కేశినేని నాని కంటే ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

ఎన్టీఆర్: కౌంటింగ్ కేంద్రం వద్ద అల్పాహారం కొరత

image

ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో అల్పాహారం కొరత వచ్చిందని ఏజెంట్ల ఆందోళన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగినటువంటి సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడే కౌంటింగ్ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు వాపోయారు. సిబ్బందికి భద్రతా, భోజన ఏర్పాట్లు అక్రమంగా ఉండాలని వారి కోరారు.