India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కైకలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఆయన హార్ట్ స్ట్రోక్ రాగానే వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ నాగార్జున నగర్‌లోని ఆయుష్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.
నందిగామ పట్టణ పరిధిలోని కెవిఆర్ కళాశాలలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎన్నికల పరిశీలకులు నరేంద్ర సింగ్ బాలి గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని పోలింగ్ కేంద్రాల్లో అధిక శాతంలో పోలింగ్ జరిగే విధంగా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. పలు పోలింగ్ కేంద్రాలలోని మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో RDO తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 4వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డ పర్యటనకు విచ్చేస్తున్నట్లు నియోజకవర్గ జనసేన అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ గురువారం తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వారాహి యాత్రలో భాగంగా అవనిగడ్డ సభలో ప్రసంగిస్తారన్నారు. నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గంపలగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి కృష్ణ దాస్ (55)గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విజయవాడ నుంచి ద్విచక్ర వాహనంపై గంపలగూడెం వస్తుండగా, చీమలపాడు వద్ద ఎదురుగా వస్తున్న గేదెలు కలబడి మీద పడినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం అతనిని విజయవాడ ఆస్పత్రి తరలించగా మృతి చెందాడు. ఎస్సై చల్లా శ్రీనివాస్ ఘటనపై విచారణ చేపట్టారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న హోమ్ ఓటింగ్ కోసం కృష్ణాజిల్లాలో 1972 మంది వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యధికంగా 409 మంది దరఖాస్తు చేసుకోగా అత్యల్పంగా పెడనలో 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. గుడివాడలో 166, పెనమలూరులో 373, పామర్రులో 228, మచిలీపట్నంలో 194, గన్నవరంలో 272 మంది దరఖాస్తు చేసుకోగా ఈ నెల 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ నిర్వహించనున్నారు.
జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మచిలీపట్నం పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోమ్ ఓటింగ్ బృందాలు వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఓటు నమోదు చేయించుకుంటున్నారు. పెడనలో జరుగుతున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియను కలెక్టర్ డీకే బాలాజీ స్వయంగా పరిశీలించారు. జిల్లాలో మొత్తం 1762 మంది హోమ్ ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.
మండలంలోని కృష్ణారావు పాలెంలో గురవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ గురువారం ఢీకొన్నాయి. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తుండగా ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా
స్థలానికి చేరుకొన్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాలోని ఈ కింది మండలాల్లో గురువారం వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఆయా మండలాల్లోని ప్రజానీకం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది.
* చందర్లపాడు
* జి కొండూరు
* గంపలగూడెం
* ఇబ్రహీంపట్నం
* కంచికచర్ల
* నందిగామ
* మైలవరం
* వీరులపాడు
* విజయవాడ రూరల్
* విజయవాడ అర్బన్
* విస్సన్నపేట
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 4వ తేదీన గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాముల విజయాన్ని కాంక్షిస్తూ గుడివాడలో స్ట్రీట్ మీటింగ్ పేరుతో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. NTR స్టేడియం నుంచి నెహ్రూ చౌక్ వరకు రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
విజయవాడలో వైద్యుని కుంటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇంట్లో ఉన్న రూ.16 లక్షలు, 300గ్రా. బంగారాన్ని శ్రీనివాస్ కారులో పెట్టాడు. కారు తాళాన్ని ఎదురింటి గేటు బాక్సులో పెట్టి అన్నయ్య వస్తే తాళం ఇవ్వాలని చెప్పాడు. ఉదయం పనిమనిషి వచ్చి చూడగా శ్రీనివాస్ పోర్టికోలో ఉరేసుకొని ఉన్నాడు. అనంతరం బాక్స్‌లో కారుతాళం చూడగా కాగితానికి తాళం అన్నకు ఇవ్వాలని ఫోన్ నంబర్ రాసి ఉంది.
Sorry, no posts matched your criteria.