Krishna

News May 16, 2024

గంటలో సమస్య పరిష్కరించిన విజయవాడ పోలీసు కమిషనరేట్

image

ఓ ప్రయాణికుడు ఆటో ఎక్కి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద దిగి తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయాడు. కాసేపటికి తేరుకున్న ప్రయాణికుడు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించగా.. విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ నందు సీసీ కెమెరాల ద్వారా ఆటో నంబర్ గుర్తించి, ఆటో డ్రైవర్‌ను పిలిపించి, వెంటనే బ్యాగుని బాధితుడికి అప్పగించారు.

News May 16, 2024

మచిలీపట్నం: జూన్ 4 వరకు 144 సెక్షన్

image

మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జూన్ 4 వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని SP అద్నాన్ నయీం అస్మి తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం మూడంచెల భద్రత ఉంటుందని చెప్పారు. వర్సిటీకి కిలోమీటరు పరిధిలో ఎక్కువమంది గుమిగూడినా, ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News May 16, 2024

ఉంగుటూరు: ఓట్ల విషయంలో మహిళపై హత్యాయత్నం.?

image

ఉంగుటూరు మండలం ఆత్కూరులో దారుణం జరిగింది. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసిందని సంధ్యారాణిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు బాధిత వర్గం తెలిపింది. ఓట్ల విషయంలో ఘర్షణ జరుగుతుండగానే.. ఈ మహిళను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏడుకొండలు ట్రాక్టర్‌తో ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి కాళ్లకు గాయాలు కాగా, గన్నవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెను వల్లభనేని వంశీ పరామర్శించారు.

News May 16, 2024

కృష్ణా: గెలుపుపై TDP, YCP నేతల ధీమా

image

పోలింగ్ ముగిసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ టీడీపీ, వైసీపీ నేతలు తమదే గెలుపు అంటూ ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని బుద్దా వెంకన్న నిన్న విజయవాడలో ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తాము గెలుస్తున్నామని, వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని జోగి రమేశ్ పెనమలూరులో అన్నారు. ఇరు పార్టీల నేతల వ్యాఖ్యలపై మీ COMMENT.

News May 16, 2024

మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు అస్వస్థత

image

కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో నగరంలోని డా. ప్రేమ్ కుమార్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయన పర్యవేక్షణలో అక్కడి నుంచి విజయవాడ రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కొనకళ్ల ఆరోగ్యం నిలకడగా ఉందని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని టీడీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

News May 16, 2024

గుడివాడ: 8 నెలల క్రితం పెళ్లి.. ఓటు వేయడానికి వచ్చి మృతి

image

గుడివాడ మండలం శేరీవేల్పూరుకు చెందిన హారికకు విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన రామ్‌సాయికి 8 నెలల కిందట వివాహమైంది. ఎన్నికల సందర్భంగా హారిక సొంతూరు వచ్చి ఓటు వేసింది. తిరిగి విజయవాడ పంపించేందుకు నర్సాపూర్ రైలు ఎక్కిద్దామని కూతురిని తండ్రి టీవీఎస్ మోపెడ్‌పై తీసుకెళ్తుండగా బొమ్మూలూరు రామాలయం వద్ద ట్రాక్టర్.. మోపెడ్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తండ్రి కళ్లదుటే హారిక మృతిచెందింది.

News May 16, 2024

కృష్ణా: లోక్‌సభ స్థానాలకు ఎంత మంది ఓటేశారంటే.!

image

విజయవాడ లోక్ సభ పరిధిలో మొత్తం 17,04,077 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 13,52,495 మంది ఓటేశారు. 79.37 శాతంగా పోలింగ్ నమోదైంది. మరోవైపు మచిలీపట్నం లోక్‌సభ పరిధిలో 15,39,460 మంది ఓటర్లు ఉంటే.. వారిలో 12,93,935 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.05శాతంగా పోలింగ్ నమోదైంది. గెలుపుపై అభ్యర్థులు ధీమాగానే ఉన్నా, జూన్ 4 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

News May 16, 2024

విజయవాడ: పవర్ లిఫ్టింగ్ పోటీలలో దేశానికి కీర్తి తీసుకొచ్చిన భరత్‌

image

చైనాలో జరిగిన ఎషియన్‌ యూనివర్శిటీ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించిన కేబీఎన్‌ కళాశాల విద్యార్థి భరత్‌కుమార్‌ ప్రతిభ దేశానికే గర్వకారణమని ఆ కళాశాల కార్యదర్శి తూనికుంట్ల శ్రీనివాసు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల కమిటీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భరత్‌ పవర్ లిఫ్టింగ్ పోటీలలో బంగారు పథకాన్ని సాధించి భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

News May 15, 2024

పామర్రు: రహదారిపై అగ్ని ప్రమాదం.. దగ్ధమైన కారు

image

పామర్రు నియోజకవర్గం కురుమద్దాలి వద్ద ప్రధాన రహదారిపై కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన ప్రాంతానికి వచ్చి మంటలను ఆర్పేశారు.. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News May 15, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గెలుపు ఎవరిది.?

image

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు 14 స్థానాల్లో గెలిచి పూర్తి ఆధిక్యం సాధించింది. టీడీపీ కేవలం 2 స్థానాలు (గన్నవరం , విజయవాడ ఈస్ట్) కే పరిమితమైంది. అటు 2 పార్లమెంట్ స్థానాల్లో చెరొకటి గెలుపొందాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయకేతనం ఎగురవేసే పార్టీ ఏదో కామెంట్ చేయండి.