Krishna

News April 19, 2024

కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న కేసులు ఇవే

image

అధికారులు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుపార్టీల అభ్యర్థులు ప్రజా సమస్యలపై పోరాడిన వారిపై కేసులు, వారి ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. వర్ల కుమార్ రాజాపై 10 కేసులు, అప్పులు రూ.29 లక్షలు. నల్లగట్ల స్వామిదాసుపై కేసులు లేవు, అప్పులు రూ.17.50 లక్షలు. యార్లగడ్డ వెంకట్రావుకు వివిధ అభియోగాల కింద 9 కేసులు, స్థిర, చరాస్తులు రూ.157.850 కోట్లు ఉన్నాయి.

News April 19, 2024

గన్నవరం గడ్డపై పాగా వేసేదెవరో..

image

గన్నవరంలో టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, సిట్టింగ్ MLA వంశీ వల్లభనేని వైసీపీ నుంచి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన యార్లగడ్డ 838 ఓట్ల తేడాతో ఓడారు. వంశీ వైసీపీలో చేరడంతో యార్లగడ్డ టీడీపీలో చేరి గన్నవరం MLA టికెట్ దక్కించుకుని నేడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రానున్న ఎన్నికల సమరంలో గన్నవరంలో వంశీ ఆధిక్యత చాటుకుంటారో, యార్లగడ్డ గెలుపు తీరాలకు చేరుకుంటారో మీ కామెంట్.

News April 19, 2024

విజయవాడ: ఎన్నిక‌ల ప‌బ్లిక్ నోటీసు విడుద‌ల‌

image

విజ‌య‌వాడలో సాధార‌ణ ఎన్నిక‌లు 2024లో భాగంగా పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించిన ఫారం-1 ఎన్నిక‌ల ప‌బ్లిక్ నోటీస్‌ను జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్, రిట‌ర్నింగ్ అధికారి ఎస్‌. డిల్లీరావు గురువారం ఉద‌యం విడుద‌ల చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ.. ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నామినేష‌న్లు స్వీక‌రిస్తున్నామని తెలిపారు.

News April 18, 2024

కృష్ణా: ఫార్మసీ విద్యార్థులకు అలర్ట్

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జనవరి 2024లో నిర్వహించిన బీ ఫార్మసీ 7వ సెమిస్టర్ పరీక్షలకు (2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు, ఏప్రిల్ 23వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.

News April 18, 2024

విజయవాడలో 133 మందికి జరిమానా

image

విజయవాడ నగర పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 133 మందికి న్యాయస్థానం గురువారం జరిమానా విధించింది. ఈ మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా, 133 మందికి రూ.10వేల చొప్పున మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తులు లెనిన్ బాబు, సురేశ్ బాబులు జరిమానా విధించారని పోలీస్ కమీషనరేట్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

News April 18, 2024

కృష్ణా జిల్లాలో తొలి రోజు నామినేషన్లు వేసింది వీరే

image

జిల్లాలో తొలి రోజు 05 నామినేషన్లు దాఖలయ్యాయి. గన్నవరం అసెంబ్లీ స్థానానికి TDP అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ 2 సెట్లు, ఆయన సతీమణి జ్ఞానేశ్వరి ఒక సెట్, పామర్రు అసెంబ్లీ స్థానానికి TDP అభ్యర్థి వర్ల కుమార్ రాజా, మచిలీపట్నం అసెంబ్లీకి పిరమిడ్ పార్టీ నుంచి వక్కలగడ్డ పావని ఒక సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. బందరు MP, అవనిగడ్డ, పెడన, పెనమలూరు, గుడివాడ MLA స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలవ్వలేదు.

News April 18, 2024

కృష్ణా: నామినేషన్‌లు దాఖలు చేసే వారికి పలు సూచనలు 

image

MPగా పోటీ చేసే అభ్యర్థులు ఫారం-2ఎ, MLAగా పోటీ చేసే వాళ్లు ఫారం-2బీ ద్వారా నామినేషన్లు దాఖలు చేయాలి. అభ్యర్థులందరూ నవీకరించిన ఫారం-26 అఫిడవిట్‌ను ఖాళీలు లేకుండా పూర్తి చేసి నామినేషన్ పత్రంతో జతచేయాలి . పోటీ చేసే అభ్యర్థి లేక ప్రతిపాదకుడు నామినేషన్ దాఖలు చేయవచ్చని కలెక్టర్ బాలాజీ తెలిపారు. MPఅభ్యర్థి రూ.25వేలు, MLAఅభ్యర్థి రూ.10వేలు, SC, STలు రూ.12,500, రూ.5వేల డిపాజిట్ చేయాలని చెప్పారు. 

News April 18, 2024

నేటి నుంచి నామినేషన్లు మొదలు: ముకేశ్ కుమార్‌ మీనా

image

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి నుంచి ప్రారంభమవుతుందని, ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్‌ మీనా తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

News April 18, 2024

కృష్ణా: మైనర్ బాలికపై అత్యాచారయత్నం.. వ్యక్తి అరెస్ట్

image

కంకిపాడులో ఓ మైనర్ బాలికపై అత్యాచారాయత్నానికి యత్నించిన వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేశామని కంకిపాడు ఎస్సై సందీప్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు కంకిపాడుకి చెందిన వంగా ప్రవీణ్ అనే వ్యక్తి ఓ బాలికపై అత్యాచారాయత్నానికి యత్నించాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్సై సందీప్ చెప్పారు. 

News April 17, 2024

పెడన చేరుకున్న చంద్రబాబు.. మరికాసేపట్లో ప్రజాగళం సభ

image

టీడీపీ అధినేత చంద్రబాబు పెడన చేరుకున్నారు. ప్రజాగళం సభలో పాల్గొనేందుకు గాను చంద్రబాబు గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి పెడన చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద మచిలీపట్నం, పెడన అభ్యర్థులు కొల్లు రవీంద్ర, కృష్ణప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన పెడన బస్టాండ్ సెంటర్‌లోని సభా స్థలికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. మరికాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా రానున్నారని సమాచారం.

error: Content is protected !!