Krishna

News April 25, 2024

నూజివీడులో భార్యపై భర్త దాడి 

image

కుటుంబ కలహాల నేపథ్యంలో మండలంలోని తుక్కులూరు గ్రామానికి చెందిన వివాహితపై భర్త బుధవారం కర్రతో దాడి చేశాడు. గ్రామానికి చెందిన పండు, బాధితురాలు ఝాన్సీతో ఏడు సంవత్సరాల కిందట ప్రేమ వివాహం జరిగింది. తన భర్త మద్యం మత్తులో తనపై పలుమార్లు దాడి చేసినట్లుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

మండలి బుద్ధ ప్రసాద్ గెలుపు కోసం కుమార్తెల ప్రచారం

image

అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ గెలుపు కోసం ఆయన కుమార్తెలు కృష్ణప్రభ, అవనిజ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళవారం ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వారి వెంట టీడీపీ మండల అధ్యక్షుడు తుమ్మల చౌదరి బాబు ఉన్నారు.

News April 25, 2024

గూడూరు: పెళ్లి కావడం లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గూడూరు మండలంలోని రాయవరంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రమేశ్(33) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా పెళ్లి కాలేదని మనోవేదనతో ఉన్నాడు. ఈ క్రమంలో మద్యంలో విషం కలుపుకొని తాగాడు. దీంతో అతడిని బందరు ఆస్పత్రి, అక్కడి నుంచి విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.

News April 25, 2024

ఆర్చరీలో మెరిసిన వెన్నం జ్యోతి సురేఖ

image

విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో సత్తా చాటింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న పోటీలో మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ రెండో స్థానంలో నిలిచింది. సురేఖ, అదితి, పర్‌ణీత్‌లతో కూడిన భారత జట్టు(2118) టీమ్ విభాగం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు, మిక్స్‌డ్ టీమ్‌లో సురేఖ- అభిషేక్ (1419) జోడీ రెండో స్థానంలో నిలిచింది.

News April 25, 2024

విజయవాడ: రూ.20కే భోజనం

image

విజయవాడ రైల్వే స్టేషన్లో ఎకానమీ మీల్స్ రూ.20, స్నాక్స్ మీల్స్ రూ.50కే అందిస్తున్నారు. వేసవి రైలు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని IRCTCతో కలిసి తక్కువ ధరకే భోజనం పథకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా జనరల్ బోగీల ప్రయాణికులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిని ప్రయోగాత్మకంగా విజయవాడతో పాటు రాజమహేంద్రవరంలో ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DRM నరేంద్ర పాటిల్ కోరారు.

News April 25, 2024

కృష్ణా జిల్లాలో 5వ రోజు 28 నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా 5వ రోజైన మంగళవారం జిల్లాలో మరో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం MP స్థానానికి 07, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 21 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 07, గన్నవరంకు 07, అవనిగడ్డకు 03, పెడనకు 01, పామర్రుకు 01, పెనమలూరుకు 01, గుడివాడకు ఒక నామినేషన్ దాఖలైనట్టు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

News April 24, 2024

కృష్ణా: అంబులెన్స్ ఢీకొని ఇద్దరి దుర్మరణం

image

విశాఖలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విజయవాడకు చెందిన చందు(20) అతడి స్నేహితుడు రామకృష్ణ (19) సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విశాఖలో వీరు బైక్‌ పై వెళుతుండగా.. 108 అంబులెన్స్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలిలోనే కన్నుమూశారు. కుమారుడి మృతదేహాన్ని చూసేందుకు సైతం దారి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో, విశాఖ పోలీసులు చందు తల్లికి డబ్బు పంపి విశాఖకు రప్పించినట్లు సమాచారం.

News April 24, 2024

నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదు: సుంకర పద్మశ్రీ

image

తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన లేదని సుంకర పద్మశ్రీ ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థినిగా పోటీ చేయాలని ఆశించానని, అధిష్ఠానం అవకాశం కల్పించలేకపోయిందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు. తన నిర్ణయాన్ని అధిష్ఠానం మన్నిస్తుందని భావిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు అభ్యర్థిగా పద్మశ్రీని నిన్న కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

News April 24, 2024

VJA: సతీశ్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్

image

సీఎం జగన్‌పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో సోమవారం ఈ పిటిషన్ సమర్పించారు. సతీశ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అతడిని ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సతీశ్ తరఫు న్యాయవాదిని జడ్జి ఆదేశించారు.

News April 24, 2024

కృష్ణా జిల్లాలో 4వ రోజు 31నామినేషన్‌లు 

image

నామినేషన్ల స్వీకరణలో భాగంగా 4వ రోజైన సోమవారం జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 31 నామినేషన్లు దాఖలవ్వగా ఇందులో మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి 03, 7 అసెంబ్లీ స్థానాలకు 28 నామినేషన్లు పడ్డాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 04, గన్నవరం 02, గుడివాడ 08, పెడన 06, అవనిగడ్డ 02, పామర్రు 03, పెనమలూరు 03 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 57 నామినేషన్లు దాఖలయ్యాయి.