India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన MBA, MCA, MSC 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ “జెర్సీ”(2019) ఈ నెల 20న విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు విజయవాడ అలంకార్ థియేటర్‌లో ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. తిన్ననూరి గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జెర్సీ రీరిలీజ్ సందర్భంగా నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
విజయవాడ మీదుగా ఈ నెల 17 నుంచి జూలై 3 వరకు ప్రతి బుధవారం విశాఖపట్నం-కొల్లామ్‌కు(నెం.08539) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇదే రైలు తిరుగు ప్రయాణంలో కొల్లామ్- విశాఖపట్నం(నెం.08540) మధ్య ఈ నెల 18 నుండి జూలై 4 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలుతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.
ఈ నెల 16వ తేదీన జిల్లాలో ఎంపిక చేసిన 142 పాఠశాలల్లో స్టేట్ లర్నింగ్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించనున్నట్టు డీఈఓ తాహేరా సుల్తాన తెలిపారు. సర్వేకు సంబంధించి సంసిద్ధత కార్యక్రమాన్ని స్థానిక కృష్ణవేణి ఐటీఐ కాలేజ్‌లో నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 142 పాఠశాలలకు చెందిన 3,299 మంది 4వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంలో ఏదైనా రెండు అంశాల్లో 90 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు.
విజయవాడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ముంబై సైబర్ పోలీస్ పేరుతో ఫోన్ చేసి ‘మీ పేరు మీద డ్రగ్స్ రవాణా జరుగుతున్నాయి. మీరు అశ్లీల చిత్రాలు చూస్తున్నందుకు కేసు నమోదు చేశాం. మీ పిల్లలు కేసులో ఇరుక్కున్నారు’ అని కొత్త రకం మోసానికి పాల్పడుతున్నారని హెచ్చరించారు. అటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైన నీటితో జిల్లాలో ఇప్పటి వరకు 150 చెరువులను 70-80% మేర నింపినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ చెరువులు నింపేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. మరో 4 రోజుల్లో నీటి విడుదల నిలిపి వేయనున్న నేపథ్యంలో 100% చెరువులను నీటితో నింపి తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
“మై డియర్ దొంగ” మూవీ టీం సోమవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మూవీలో నటించిన “ఈ నగరానికి ఏమైంది” ఫేమ్ అభినవ్.. ఇతరులు నిఖిల్, దివ్యశ్రీ, షాలిని తదితరులు దుర్గమ్మను దర్శించుకుని అర్చక స్వాముల ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. మై డియర్ దొంగ మూవీని చూసి ఆదరించాలని అభినవ్ ప్రేక్షకులను కోరారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల నెట్ బాల్ మహిళల టోర్నమెంట్ 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి వి.లక్ష్మీ కనకదుర్గ తెలిపారు. ఈ టోర్నీలో కృష్ణా వర్శిటీ జట్టు ఎంపిక చేసే యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ ఆధ్వర్యంలో జరుగనున్న అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీకి పంపనున్నట్లు తెలిపారు. 20వ తేదీ ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్పారు.
కృష్ణా వర్సిటీ పరిధిలోని బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులకు 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 25,26, 27, 29 తేదీల్లో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.
రూరల్ మండలంలోని పార్నాసలో అక్క ఇంజినీరింగ్, చెల్లెలు ఇంటర్మీడియట్‌లో తప్పడంతో ఇద్దరూ సోమవారం పురుగు మందు తాగారు. చెల్లే చికిత్స పొందుతూ మృతిచెందగా.. అక్క బయటపడింది. ఎస్సై లక్ష్మీనరసింహమూర్తి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Sorry, no posts matched your criteria.