India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేన పార్టీ ఎకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను నాలుగేళ్ల నుంచి విడుదల చేయకుండా తన బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు పవన్ వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఆన్లైన్‌లో ట్రేడింగ్ చేసి రూ.35 లక్షలు మోసపోయానంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. పోరంకికి చెందిన శ్రీకాంత్ ఆన్లైన్ ట్రేడింగ్‌లో సుమారు రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టారు. తనకు డబ్బు అవసరమై విత్ డ్రా చేద్దామని అడగ్గా.. రెండు రోజుల పడుతుందని వారు తెలిపి అతని ఖాతాను బ్లాక్‌లో పెట్టారన్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈనెల 22వ తేదీ జరగాల్సిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల నామినేషన్ అనివార్య కారణాల వల్ల 25వ తేదీకి మారిందని గుడివాడ వైసీపీ కార్యాలయం తెలిపింది. యథావిధిగా ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్‌లోని ఇంటి వద్ద నుంచి ర్యాలీగా ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్ని విజయవంతం చేయాలని పార్టీ నేత లు కోరారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా మైదానంలో ఏప్రిల్ 21న ఆదివారం హంటింగ్ టైగర్స్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్ 14 బాలుర ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శివప్రసాద్ నాయక్ శుక్రవారం తెలిపారు. ఈ పోటీలకు జిల్లాలో ఆసక్తిగలవారు ఎవరైనా జట్టుగా వచ్చి పోటీ చేయవచ్చని అన్నారు. ఈ పోటీలు ఉదయం 6 గంటలకు మొదలవుతాయని అదే రోజు సాయంత్రం విజేతలకు బహుమతులు కూడా అందజేస్తామన్నారు.
విజయవాడలో దొంగతనం కేసులో నిందితుడికి నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి కరిముల్లా తీర్పునిచ్చారు. గుణదలకు చెందిన గోపి 2023లో కరెంటు వైర్లు దొంగిలిస్తుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై నేరం రుజువవడంతో గురువారం న్యాయమూర్తి నాలుగు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీపీ క్రాంతి రానా టాటా తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నామినేషన్ల ప్రకియ జోరుగా కొనసాగుతుంది. కేవలం ఎన్టీఆర్ జిల్లాలోనే రెండో రోజుల్లో మొత్తం 18 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి మూడు నామినేషన్లు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 15 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కృష్ణా జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ.. ఆనారోగ్యంతో మహమ్మద్ బాషా (44) శుక్రవారం మృతి చెందాడు. హోంగార్డ్ పట్ల జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ సంతాపం వ్యక్తపరిచారు. బాషా కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని అధైర్య పడవద్దని తెలిపారు. ఏ సహాయం కావాలన్నా ధైర్యంగా వచ్చి అడగవచ్చని అన్నారు.డీఎస్పీ అబ్దుల్ సుభాన్, ఆర్ఐ రవికుమార్, తదితరులు నివాళులర్పించారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్, భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 6 నుంచి జూన్ 3 వరకు ప్రతి సోమవారం చెన్నై సెంట్రల్, భువనేశ్వర్(నెం.06073), మే 7 నుండి జూన్ 4 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్, చెన్నై సెంట్రల్(నెం.06074) రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
ప్రజల మధ్య నిలబడటం అంటే పైరసీలు చేసి రాజ్యసభ సభ్యుడైనంత ఈజీ కాదని, విజయవాడ పశ్చిమ NDA కూటమి అభ్యర్థి సుజనా చౌదరిని ఉద్దేశించి వైసీపీ నేత పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. బ్యాంకుల నుంచి కొట్టేసిన రూ. వేల కోట్లలో ఎంతో కొంత సుజనా నుంచి తీసుకోవచ్చని.. NDA కూటమి నాయకులు ఆయన చుట్టూ చేరారని పోతిన వ్యాఖ్యానించారు. మాటలు తప్ప మూటలు లేవని కూటమి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారని పోతిన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అధికారులు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుపార్టీల అభ్యర్థులు ప్రజా సమస్యలపై పోరాడిన వారిపై కేసులు, వారి ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. వర్ల కుమార్ రాజాపై 10 కేసులు, అప్పులు రూ.29 లక్షలు. నల్లగట్ల స్వామిదాసుపై కేసులు లేవు, అప్పులు రూ.17.50 లక్షలు. యార్లగడ్డ వెంకట్రావుకు వివిధ అభియోగాల కింద 9 కేసులు, స్థిర, చరాస్తులు రూ.157.850 కోట్లు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.