India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB), కటక్(CTC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB- CTC ట్రైన్‌ను ఈ నెల 16, 23, 30 తేదీల్లో, నం.07166 CTC- HYB ట్రైన్‌ను ఈ నెల 17, 24, మే 1వ తేదీన నడుపుతామన్నారు. ఈ స్పెషల్ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో అక్టోబర్ 2023లో నిర్వహించిన ఎం-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1100 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమలో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీ పడగా, మచిలీపట్నంలో అత్యల్పంగా 8 మంది బరిలో నిలిచారు. జిల్లాల విభజన అనంతరం స్థానికంగా రాజకీయ పరిస్థితులు మారినందునా తాజా ఎన్నికల్లో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యపై ఆసక్తి నెలకొంది. కాగా గత ఎన్నికల్లో పశ్చిమలో 10 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలవడం విశేషం.
ప్రయాణీకుల రద్దీ మేరకు రాయనపాడు మీదుగా సికింద్రాబాద్(SC), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07225 SC- SHM ట్రైన్‌ను ఈ నెల 15 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, నం. 07226 SHM- SC ట్రైన్‌ను ఈ నెల 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం నడుపుతామన్నారు. ఈ స్పెషల్ ట్రైన్లు విజయవాడలో ఆగవని, సమీపంలోని రాయనపాడు స్టేషన్‌లో ఆగుతాయని అన్నారు.
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్లకు ఈ నెల 22లోపు సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు. స్పెషల్ ఓటర్లు, సర్వీస్ ఓటర్లు, ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ తదితర 5 కేటగిరీలకు చెందిన వారికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించిందని కలెక్టర్ చెప్పారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సున్నితమైన ప్రాంతాలలో ప్రత్యేక బలగాలను మోహరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా విజయవాడ మీదుగా న్యూ గుంటూరు వెళ్లే 2 రైళ్లను దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 30 వరకు ఈ రెండు రైళ్లు న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ మీదుగా వెళ్తాయన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
*నం.16031 చెన్నై సెంట్రల్- SVD కత్ర అండమాన్ ఎక్స్‌పెస్ *నం.16093 చెన్నై సెంట్రల్- లక్నో ఎక్స్‌ప్రెస్
పోతిన మహేశ్ వైసీపీలో చేరికతో విజయవాడ వెస్ట్ రాజకీయం రసవత్తరంగా మారింది. జనసేనలో బీసీ నేతగా ఎదిగిన మహేశ్ ద్వారా ఆ వర్గ ఓటర్లను వైసీపీ వైపు మళ్లించేలా అధిష్ఠానం వ్యూహాలకు సిద్ధమైంది. మరోవైపు, కూటమి నుంచి బరిలో దిగిన సుజనా చౌదరి కచ్చితంగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. మహేశ్ పార్టీ మార్పుతో ఏ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ముగింపు సభను ఈ నెల 13న ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా గత 6 నెలలుగా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి వారికి ఆర్థిక సాయం అందచేశారు. ఈ మేరకు సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నేత కేశినేని చిన్ని చెప్పారు.
విజయవాడ: వైఎస్సార్ హెల్త్ విశ్వవిద్యాలయంలో 24వ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రెటరీ ఈ త్రిమూర్తి రాజు బుధవారం తెలిపారు. ఈ పోటీలు ఏప్రిల్ 13వ తేదీ నుంచి 15 వరకు జరుగుతాయన్నారు. ఈ పోటీలలో 25 మెడికల్, డెంటల్ కళాశాలల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు.
Sorry, no posts matched your criteria.