India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అవనిగడ్డలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న యువకుడు మరో ఇద్దరు యువకులతో కలసి కబడ్డీ క్రీడలో మెలకువలు నేర్పిస్తామని బాలికను లోబరుచుకున్నట్లు సమచారం. ఈ క్రమంలో బాలిక వీడియోలు తీసి, తమకు సహకరించకుంటే వీడియోలు బయట పెడతామని బెదిరించినట్లు తెలుస్తోంది. ఘటనపై డీఎస్పీ మురళీధర్ విచారణ చేస్తున్నారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన Mcom, MA, MED, MHR, SWO 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022-23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలన్నారు.
సివిల్స్ ఫలితాల్లో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్, విజయవాడ బ్రాంచీల అభ్యర్థులు సత్తాచాటారని డైరెక్టర్ శరత్ చంద్ర తెలిపారు. అనన్య రెడ్డికి ఆల్ ఇండియా 3వ ర్యాంకు, రుహానికి 5వ ర్యాంకుతో పాటు 16, 19, 42, 61, 91వ ర్యాంకులు వచ్చాయని చెప్పారు. దాదాపు 50కి పైగా IAS, IPS, ఐఆర్ఎస్ వంటి ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని ఆయన చెప్పారు. ఇందులో 19 ర్యాంకులు తెలుగు విద్యార్థులకు వచ్చాయన్నారు.
ఈ నెల 18 నుంచి అభ్యర్థులు ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కృష్ణా జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
* మచిలీపట్నం MP నామినేషన్లు : కలెక్టరేట్
* మచిలీపట్నం MLA : తహశీల్దార్ ఆఫీస్
* అవనిగడ్డ MLA : తహశీల్దార్ ఆఫీస్
* పెడన MLA : తహశీల్దార్ ఆఫీస్
* పామర్రు MLA : తహశీల్దార్ ఆఫీస్
* గుడివాడ MLA : తహశీల్దార్ ఆఫీస్
* గన్నవరం MLA : తహశీల్దార్ ఆఫీస్
* పెనమలూరు MLA : తహశీల్దార్ ఆఫీస్
ఫుట్ పాత్ కోసం వేసే టైల్ రాయిని జేబులో వేసుకుని వచ్చి సడన్‌గా సీఎం జగన్‌పై సతీశ్ అనే యువకుడు దాడి చేసినట్లు సిట్ అధికారులు మంగళవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. అతడితో పాటు ఉన్న ఆకాశ్, దుర్గారావు, చిన్న, సంతోష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
బందరు మండలం తపసిపూడి ఇటుకల ఫ్యాక్టరీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి ఆచూకీ తెలిసిన వాళ్లు బందరు తాలుకా పోలీస్ స్టేషన్ తెలిపాలని సీఐ శ్రీనివాస్ కోరారు.
ఢిల్లీ వెళ్లి తిట్లు తిని, చంద్రబాబుని CM చేయడానికి పవన్ నానా కష్టాలు పడినా క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు పవన్‌ను పట్టించుకోవడం లేదని వైసీపీ నేత పోతిన మహేశ్ ట్వీట్ చేశారు. అభిమానుల్ని జెండా కూలీలుగా మార్చి, నమ్మిన వారిని నట్టేట ముంచి విశ్వాసం చూపినా తెనాలిలో జరిగిన పవన్ సభకు అక్కడి టీడీపీ నేత ఆలపాటి రాజా హాజరు కాలేదన్నారు. టీడీపీ నేతలు పవన్ మొహం చూడటంలేదంటూ పోతిన పవన్‌పై ఫైరయ్యారు.
మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన కైతేపల్లి మురళి, శ్రీవల్లి దంపతుల కుమారుడు కైతేపల్లి షణ్ముఖ వర్ధన్‌ను మాజీ సీఎం చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ఇటీవల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో 470 మార్కులకు 465 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసిన షణ్ముఖ వర్ధన్‌ను చంద్రబాబు సత్కరించారు.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన MBA, MCA, MSC 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చన్నారు.
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ “జెర్సీ”(2019) ఈ నెల 20న విజయవాడలో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు విజయవాడ అలంకార్ థియేటర్లో ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. తిన్ననూరి గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జెర్సీ రీరిలీజ్ సందర్భంగా నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Sorry, no posts matched your criteria.