India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జనసేనకు ఆ పార్టీ నేత పోతిన మహేశ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్‌కు లేఖ రాశారు. జనసేన పార్టీలో తనకున్న పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోతిన మహేశ్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించగా, ఆ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే.
జగ్గయ్యపేట టీడీపీలో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తల్లి సోమవారం ఉదయం మాతృమూర్తి సక్కుబాయి (90) మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మృతితో జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులలో తీవ్ర విషాదం నెలకొంది.
రామరాజ్యనగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ల మధ్య ఉన్న చెట్టుకు ఒ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. జన సంచారం లేని ప్రాంతంలో సుమారు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు చేప్పారు. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రతకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. చలివేంద్రాలు సజావుగా పనిచేసేలా చూడాలని చెప్పారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి(పశ్చిమ బెంగాల్)కు అన్‌రిజర్వడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.06077 ట్రైన్‌ను ఈ నెల 13, 20, 27 తేదీలలో చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత పెదపారుపూడిలో నమోదు అయింది. ఆదివారం పెదపారుపూడిలో 43.58 డిగ్రీలు నమోదు అయింది. కంకిపాడులో 41.75 డిగ్రీలు, బాపులపాడులో 41.64 డిగ్రీలు, గుడివాడ మండలం మెరకగూడెంలో 41.51 డిగ్రీలు, పెద్ద అవుటుపల్లిలో 41.42 డిగ్రీలు, నందివాడలో 41.17 డిగ్రీలు, ఉంగుటూరు మండలం నందమూరులో 41.0 డిగ్రీలు నమోదు అయింది. పామర్రులో 40, తేలప్రోలులో 39.75 డిగ్రీలు, పోలుకొండలో 39.5 డిగ్రీలు నమోదైంది.
కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన బీటెక్ 5, 7వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ చూడవచ్చన్నారు.
మర్లపాలెం కోనేటి చెరువులో పడి శనివారం పశువుల కాపరి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన తానంకి చంటి (55) గేదెలు కాయడానికి వెళ్ళి చెరువులో పడి మృతి చెందాడు. చెరువు వద్ద మృతుడి కాలు చెప్పు కనబడటంతో చాట్రాయి ఎస్సై స్వామి దాని ఆధారంగా జాలర్లను తీసుకువచ్చి వెతికించడంతో మృతదేహం దొరికింది.
విజయవాడలో పోలీసులు రూ.కోటి బంగారం కొట్టేశారనే వార్త అవాస్తవమని పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత సత్యనారాయణపురం పరిధిలో, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో ఎటువంటి బంగారం దొరకలేదని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో JSP అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణకు అవనిగడ్డ, పెడనలో 24 వేలకు పైబడి ఓట్లు లభించాయి. నియోజకవర్గాల వారీగా రామకృష్ణకు వచ్చిన ఓట్లలో అవనిగడ్డలో 24,594, పెడనలో 24,134 ఓట్లు రాగా, అత్యల్పంగా పామర్రులో 8,615 ఓట్లు లభించాయి. తాజా ఎన్నికల్లో జనసేన నుంచి బాలశౌరి పోటీ చేస్తుండగా ఈ రెండు నియోజకవర్గాలలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లాలో ఆసక్తి నెలకొంది.
Sorry, no posts matched your criteria.