India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీ-విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి గడువులోగా అత్యంత కచ్చితత్వంతో పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. శనివారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
ఇటీవలి కాలంలో కొన్ని వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్‌లో ఐపీఎస్ అధికారులపై వచ్చిన అవాస్తవ కథనాలను ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, విజయవాడ సీపీ కాంతి రానా టాటా అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాని కలిసి ఈ ఘటనలపై రవీంద్రబాబు ఐపీఎస్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఈ ఘటనలు జరగకుండా నియంత్రించాలని కాంతి రానా టాటా కోరారు.
దమ్మపేట మండలం మందలపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన చీపు లక్ష్మి(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో భర్త రామకృష్ణ(35)కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లాలో 6,7,8 క్లైమ్ ఫారాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 3,078 దరఖాస్తులు పరిష్కరిస్తామని కలెక్టర్ DK బాలాజీ తెలిపారు. శనివారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో బాలాజీతో పాటు జిల్లాలోని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలుపై క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలిచ్చామని ఉన్నతాధికారులకు కలెక్టర్ చెప్పారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్‌కోయిల్(NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నెం.06103 NCJ- DBRG రైలును ఏప్రిల్ 12, 26, మే 10, 24 తేదీలలో, నెం.06104 DBRG- NCJ రైలును ఏప్రిల్ 17, మే 1, 15, 29న నడుపుతామని చెప్పారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు పామర్రు ఎన్టీఆర్ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. సభ అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గాన ఉయ్యూరు మార్కెట్ సెంటర్ చేరుకొని సాయంత్రం 6 నుంచి 7.30 వరకు బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు చంద్రబాబు రేపటి పర్యటనల షెడ్యూల్ విడుదల చేశాయి.
కృష్ణా వర్సిటీ పరిధిలో బీ-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 1,8వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 24 నుంచి మే 2వ తేదీ వరకూ నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్, పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
మచిలీపట్నం సముద్రంలో ఈ నెల 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ జిల్లా మత్స్యశాఖకు శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ , మోటార్ బోట్లు ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటకు 61 రోజుల పాటు నిషేధించామని తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం ద్వారా మత్స్యసంపద పెరుగుతోందని తెలిపారు.
సైబర్ నేరగాళ్లు రూ.18 లక్షలు కాజేశారు. పెనమలూరు మండలం కానూరుకు చెందిన శ్రీనివాసరావు బీమా కంపెనీలో పని చేస్తుంటాడు. జనవరిలో ఆయనకు వాట్సాప్‌లో గూగూల్ మ్యాప్ రేటింగ్, రివ్యూస్ చేస్తే సొమ్ము ఇస్తామని మెసేజ్ వచ్చింది. తొలుత ఆయనకు కొంతమేర ఆదాయం చూపి, వ్యాపార లావాదేవీల పేరుతో నేరగాళ్లు రూ.18 లక్షలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించారు. చివరకు మోసపోయానని గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విజయవాడలో పోక్సో కేసు నమోదైంది. మధురానగర్‌కు చెందిన బాలిక(13) 8వ తరగతి చదువుతోంది. నవీన్ అనే యువకుడు బాలిక స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గతంలోనూ ఇలా జరిగితే అతడిని మందలించినట్లు బాలిక తల్లి చెప్పింది. మళ్లీ వేధించడంతో పాటు చంపేస్తానని యువకుడు బెదిరించడంతో గుణదల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు యువకుడిపై శుక్రవారం కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.