India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి 24వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అధికారులు తెలిపారు. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 18 నుంచి 24వరకు సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి జిల్లాలో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి ప్రకటించారు.
* మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి : దేవరపల్లి దేవమణి
* మచిలీపట్నం అసెంబ్లీ అభ్యర్థి – సౌడాడ బాలాజీ
* అవనిగడ్డ : గుంటూరు నాగేశ్వరరావు
* గుడివాడ : గుడివాడ బోసు
* పామర్రు : రాయవరపు బాబూ రాజేంద్రప్రసాద్
* పెడన : ఈడే కాశీ సుశేశ్వరరావు
* పెనమలూరు – మహేష్ యాదవ్
* గన్నవరం – సింహాద్రి రాఘవేంద్రరావు
విజయవాడలో సీఎం జగన్ శనివారం బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ ప్రతినిధులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. శనివారం సాయంత్రం 4.30 తాడేపల్లి నుంచి బయలుదేరి కనకదుర్గ వారధి మీదుగా బందర్ రోడ్డు, చుట్టుగుంట, సంగీత కళాశాల, బుడమేరు వంతెన, ప్రకాష్ నగర్, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరులో బస్సు యాత్ర నిర్వహిస్తారన్నారు. అనంతరం రాత్రి 7:30కు కేసరపల్లిలో బస చేస్తారు.
గుడివాడలో ఈ నెల 14న సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇందుకోసం ఏలూరు రోడ్ నాగవరప్పాడు వైఎస్సార్ కాలనీకి సమీపంలో సభ ఏర్పాటు చేస్తున్నారు. 2 రోజులుగా పనులు వేగంగా సాగుతున్నాయి. సిద్ధం సభలో జగన్ ప్రసంగించనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జనసమీకరణ చేస్తున్నారు.
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 17,425 మందికి 1,5688 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 34,156 మందికి 29,707 మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లోనూ 84 శాతంతో కృష్ణా తొలిస్థానంలో నిలిచింది. 20,324 మందికి 17,070 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 79 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 38,307 మందికి 30353 మంది పాసయ్యారు.
గుడివాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇందుకోసం ఏలూరు రోడ్ నాగవరప్పాడు వైఎస్సార్ కాలనీకి సమీపంగా సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. గత రెండు రోజులుగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈనెల 14వ తేదీన జగన్ గుడివాడలో సిద్ధం సభకు రానున్న నేపథ్యంలో కృష్ణాజిల్లాకు చెందిన పలు నియోజకవర్గాల ప్రజలు హాజరుకానున్నారు.
రాజకీయంగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు కృష్ణాజిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన ఉయ్యూరు మహేశ్, వైసీపీకి చెందిన ఆరేపల్లి శ్రీకాంత్ పై వణుకూరు వీఆర్వో వెంకటేశ్వరరావు ఆధారాలతో సహా పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పెనమలూరు ఎస్సై ఉషారాణి తెలిపారు.

రక్షణ కోసం ముసునూరు పోలీసులను గురువారం రాత్రి నూతన దంపతులు ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామానికి చెందిన టి.రాధాకృష్ణ, పెదపాడు మండలం కేఆర్ పాలెం గ్రామానికి చెందిన ఎన్. నవ్య ఏలూరు పట్టణ కేంద్రంలో సోషల్ మ్యారేజ్ సంస్థ వారి ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నారు. మేజర్లమైన తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని పోలీసుల్ని ఆశ్రయించినట్లు వారు తెలిపారు.
Sorry, no posts matched your criteria.