India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వచ్చే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను(నెం.12077) దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారాలు మినహా ఈ నెల 10 నుంచి 30 వరకు ఈ ట్రైన్ న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ స్టేషన్ల మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో కింది కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
☞ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ)- 3వ సెమిస్టర్
☞ ఎం- ఫార్మసీ- 2వ సెమిస్టర్
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ నగరంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా అవసరం లేకుండా రోడ్లపైకి రావద్దన్నారు. బయటకు వచ్చే ముందు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వడదెబ్బ సూచనలు కనిపిస్తే సమీపములోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందాలన్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ నుంచి హుబ్లీకి (ట్రైన్ నెం.07001) ఈ నెల 10న, హుబ్లీ నుంచి విజయవాడకు (ట్రైన్ నెం.07002) ఈ నెల 11న స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు స్టేషన్లలో ఆగుతాయన్నారు. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
తోటమూల ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీంలో సోమవారం మధ్యాహ్నం ట్రాక్టర్ ఇంజిన్ తిరగబడింది. డ్రైవర్ ట్రాక్టర్ అడుగుభాగాన ఇరుక్కోగా.. సమచారం అందుకున్న పోలీసులు జేసీబీ సాయంతో ట్రాక్టర్‌ను పైకి లేపారు. అయితే ట్రాక్టర్ కింద ఇరుక్కున్న డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పడంతో అందరూ అతన్ని మృత్యుంజయుడన్నారు. ఇతను ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తని. దుక్కుల నిమిత్తం ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినట్లు సమాచారం.
ముసునూరు మండలం కాట్రేనిపాడులో యువకుడిపై దాడి చేశారు. ఆ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక ముసునూరు గ్రామానికి చెందిన రత్నకుమార్(21) మూడు ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత రాత్రి తన కుమార్తె నువ్వు లేకపోతే చనిపోతానని అంటోందని రత్నకుమార్‌ను పిలిపించారు. బాలిక, ఇంటికి వచ్చిన యువకుడిపై బాలిక కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని రత్న కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ తన తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. పార్టీలోని పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడనున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. పోతిన మహేశ్ ఏ నిర్ణయం తీసుకుంటారో, అది వెస్ట్‌లో కూటమిపై ఎలాంటి ప్రభావం చూపనుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జనసేనకు ఆ పార్టీ నేత పోతిన మహేశ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్‌కు లేఖ రాశారు. జనసేన పార్టీలో తనకున్న పదవి బాధ్యతలు, క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జన సైనికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పోతిన మహేశ్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించగా, ఆ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే.
జగ్గయ్యపేట టీడీపీలో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తల్లి సోమవారం ఉదయం మాతృమూర్తి సక్కుబాయి (90) మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మృతితో జగ్గయ్యపేట టీడీపీ శ్రేణులలో తీవ్ర విషాదం నెలకొంది.
రామరాజ్యనగర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌ల మధ్య ఉన్న చెట్టుకు ఒ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. జన సంచారం లేని ప్రాంతంలో సుమారు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు చేప్పారు. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.