Krishna

News April 8, 2024

వ‌డ‌దెబ్బ బారిన‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి: డిల్లీరావు

image

వేస‌విలో పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో వ‌డదెబ్బ బారిన పడకుండా ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించారు. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు క్ర‌మంగా పెరుగుతున్నందున ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఎండ తీవ్ర‌త‌కు గురికాకుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. చ‌లివేంద్రాలు స‌జావుగా ప‌నిచేసేలా చూడాల‌ని చెప్పారు.

News April 7, 2024

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు అన్‌రిజర్వడ్ స్పెషల్ రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి(పశ్చిమ బెంగాల్)కు అన్‌రిజర్వడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.06077 ట్రైన్‌ను ఈ నెల 13, 20, 27 తేదీలలో చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News April 7, 2024

జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత పెదపారుపూడిలో నమోదు

image

జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత పెదపారుపూడిలో నమోదు అయింది. ఆదివారం పెదపారుపూడిలో 43.58 డిగ్రీలు నమోదు అయింది. కంకిపాడులో 41.75 డిగ్రీలు, బాపులపాడులో 41.64 డిగ్రీలు, గుడివాడ మండలం మెరకగూడెంలో 41.51 డిగ్రీలు, పెద్ద అవుటుపల్లిలో 41.42 డిగ్రీలు, నందివాడలో 41.17 డిగ్రీలు, ఉంగుటూరు మండలం నందమూరులో 41.0 డిగ్రీలు నమోదు అయింది. పామర్రులో 40, తేలప్రోలులో 39.75 డిగ్రీలు, పోలుకొండలో 39.5 డిగ్రీలు నమోదైంది.

News April 7, 2024

కృష్ణా: బీటెక్ విద్యార్థులకు అలర్ట్..

image

కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన బీటెక్ 5, 7వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ చూడవచ్చన్నారు.

News April 7, 2024

చాట్రాయి: కోనేటి చెరువులో పడి పశువుల కాపరి మృతి 

image

మర్లపాలెం కోనేటి చెరువులో పడి శనివారం పశువుల కాపరి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన తానంకి చంటి (55) గేదెలు కాయడానికి వెళ్ళి చెరువులో పడి మృతి చెందాడు. చెరువు వద్ద మృతుడి కాలు చెప్పు కనబడటంతో చాట్రాయి ఎస్సై స్వామి దాని ఆధారంగా జాలర్లను తీసుకువచ్చి వెతికించడంతో మృతదేహం దొరికింది. 

News April 7, 2024

విజయవాడ: రూ.కోటి కథనంపై సీపీ వివరణ

image

విజయవాడలో పోలీసులు రూ.కోటి బంగారం కొట్టేశారనే వార్త అవాస్తవమని పోలీస్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత సత్యనారాయణపురం పరిధిలో, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో నిర్వహించిన తనిఖీలలో ఎటువంటి బంగారం దొరకలేదని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

News April 7, 2024

కృష్ణా: ఆ 2 చోట్లా జనసేనకు గణనీయంగా ఓట్లు

image

2019 ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో JSP అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణకు అవనిగడ్డ, పెడనలో 24 వేలకు పైబడి ఓట్లు లభించాయి. నియోజకవర్గాల వారీగా రామకృష్ణకు వచ్చిన ఓట్లలో అవనిగడ్డలో 24,594, పెడనలో 24,134 ఓట్లు రాగా, అత్యల్పంగా పామర్రులో 8,615 ఓట్లు లభించాయి. తాజా ఎన్నికల్లో జనసేన నుంచి బాలశౌరి పోటీ చేస్తుండగా ఈ రెండు నియోజకవర్గాలలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లాలో ఆసక్తి నెలకొంది.

News April 7, 2024

సీ విజిల్ ఫిర్యాదుల ప‌రిష్కారం: డిల్లీరావు

image

సీ-విజిల్ యాప్ ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించి గ‌డువులోగా అత్యంత క‌చ్చిత‌త్వంతో ప‌రిష్క‌రిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. శనివారం స‌చివాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముకేష్ కుమార్ మీనా.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, క‌లెక్ట‌ర్లు, సీపీలు, ఎస్పీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

News April 6, 2024

ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన విజయవాడ సీపీ కాంతి రానా టాటా

image

ఇటీవలి కాలంలో కొన్ని వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్‌లో ఐపీఎస్ అధికారులపై వచ్చిన అవాస్తవ కథనాలను ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, విజయవాడ సీపీ కాంతి రానా టాటా అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనాని కలిసి ఈ ఘటనలపై రవీంద్రబాబు ఐపీఎస్‌తో కలిసి ఫిర్యాదు చేశారు. భవిష్యత్తులో ఈ ఘటనలు జరగకుండా నియంత్రించాలని కాంతి రానా టాటా కోరారు.

News April 6, 2024

కృష్ణా: రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్ల మృతి

image

దమ్మపేట మండలం మందలపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం, చీమలపాడు గ్రామానికి చెందిన చీపు లక్ష్మి(32), ఇద్దరు కూతుళ్లు శరణ్య(8), శాన్విక(6) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో భర్త రామకృష్ణ(35)కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.