India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోడూరు సచివాలయం-2 పరిధిలో వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రబాబును విధుల నుంచి తొలగించినట్లు కోడూరు ఎంపీడీవో ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలలో అతను పాల్గొన్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గురువారం వాలంటీర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో తెలియజేశారు.
ఉయ్యూరులో వ్యభిచార గృహంపై గురువారం పోలీసులు దాడి చేశారు. ఉయ్యూరు టౌన్ సిఐ హబీబ్ బాషా తెలిపిన వివరాలు మేరకు.. వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేశామన్నారు. ముగ్గురు మహిళలు, ఓ విటుడుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉయ్యూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ యం.సుహాసిని గంపలగూడెంలోని చౌటపల్లి, ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పులు నిర్వహణ తీరు, లక్ష్యాల సాధనకు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు. పి.హెచ్.సిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలు అమలు తీరు పర్యవేక్షించారు. పీహెచ్సీలో కాన్పులు చేయని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రామ్ చరణ్, కాజల్, అమలాపాల్ నటించిన ‘నాయక్'(2013) సినిమా ఈ నెల 23, 24వ తేదీల్లో రీరిలీజ్ అవ్వనుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 27న చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ G3 థియేటర్‌లో విడుదల కానుంది.’నాయక్’ సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమాలోని పాటలు, సీన్స్ పోస్ట్ చేస్తున్నారు.
విజయవాడ వెస్ట్ కూటమి టికెట్‌పై వివాదం ముదురుతోంది. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో జనసేన టికెట్ తనదే అని అన్నారు. టికెట్ ఇవ్వని పక్షంలో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వెల్లంపల్లిపై, బీజేపీ సెంట్రల్‌లో పోటీ చేయాలన్నారు. నిన్న పవన్‌ను కలిసినప్పుడు ఈ విషయం చెప్పినట్లు వివరించారు.
మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్‌కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.
ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాలు తనిఖీ చేసేందుకు ప్రత్యేక చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల సరిహద్దులో ప్రకాశం బ్యారేజ్ చెక్ పోస్ట్ కీలకమైందన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే వదిలేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటారని చెప్పారు.
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో.. ఒక విద్యార్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్‌కు పట్టుబడ్డారు. దీంతో పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ విజయలక్ష్మి అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారామయ్య అనే విద్యార్థికి బదులు జోసెఫ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా ఈ నెల 25, 26 తేదీల్లో సత్రాగచ్చి(SRC), మహబూబ్‌నగర్(MBNR) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 25న నెం.08845 SRC- MBNR, ఈ నెల 26న నెం.08846 MBNR- SRC మధ్య ఈ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఏపీలో ఈ రైళ్లు విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లిలో ఆగుతాయన్నారు.
మచిలీపట్నం మండలం చిన్నాపురంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్లు పై అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆరుగురు వాలంటీర్లపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ MPDO ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకుంటున్నా కొందరు నిబంధనలు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు నేతలు ఆరోపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.