India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సీపీఐ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశాలను జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుందని, 2, 3 తేదీల్లో రాష్ట్ర సమితి సమావేశాలు కొనసాగుతాయన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ సమావేశాలకు హాజరవుతారని, ఈ సమావేశాలు జయప్రదం చేయాలని ఆయన తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఒడిశా రాష్ట్రం కటక్‌లోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జాతీయ ఫెన్సింగ్ పోటీలలో జగ్గప్పదొర కాంస్య పతకం సాధించాడు. దీనితో జగ్గప్ప అంతర్జాతీయ ఫెన్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా ఫెన్సర్ జగ్గప్పదొరను, శిక్షకులు లక్ష్మి లావణ్యను ఉమ్మడి కృష్ణా జిల్లా ఫెన్సింగ్ సంఘం సభ్యులు నాగరాజు, విజయ్ కుమార్ అభినందించారు.

ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే నం.20803, నం.20804 విశాఖ-గాంధీధామ్ ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 4 మధ్య విజయవాడ-విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు.

కాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున నం.20806, నం.20805 ఏపీ ఎక్స్‌ప్రెస్‌లు(AC) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 22 నుంచి జులై 5 వరకు విజయవాడ- బల్లార్షా- నాగ్‌పూర్ మీదుగా కాక విజయనగరం- రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

విజయవాడ శివారు గూడవల్లిలో విద్యార్థిని శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పటమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. అనంతపురానికి చెందిన జాహ్నవి చదువు నిమిత్తం గూడవల్లి వచ్చింది. శనివారం విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. జాహ్నవి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

ఎనికేపాడు నివాసి అయిన పెరూరి సత్యనారాయణ (68), గోవిందమ్మ దంపతులపై శుక్రవారం రాత్రి 10 గంటలకు దోపిడీ జరిగింది. వారు నిర్వహిస్తున్న కిరాణా షాపుకి వచ్చిన ఒక వ్యక్తి బాబాయ్ అంటూ మాట కలిపి షాపు షటర్ దింపి మరొక ఇద్దరితో కలసి వారిద్దరి చేతులు కట్టేసి రూ.1.80 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం దోచేశారు. ఈ ఘటనపై పటమట పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా CCTV ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

“ఫాదర్స్ డే” సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తన తండ్రి సుబ్బారావు జ్ఞాపకాలను పంచుకున్నారు. రైస్ మిల్ నిర్వహించే తన తండ్రి చాలా ప్రశాంతంగా ఉండేవారని రవీంద్ర చెప్పారు. అందరితో మంచిగా ఉండాలని, ఆప్యాయంగా పలకరించాలని చెప్పేవారన్నారు. తన తండ్రి మాటలే తనలో మార్పు తెచ్చాయన్నారు. ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథం ఆయన వద్ద నేర్చుకున్నానని రవీంద్ర చెప్పారు.

ప.గో జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 11నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున ఓ బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు.

రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ ద్రోణి కారణంగా ఆదివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పొరుగు జిల్లాలైన ఏలూరు, గుంటూరులో సైతం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయని కూర్మనాథ్ చెప్పారు.

పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ టీడీపీలో చేరుతున్నారంటూ శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేశాయి. జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ శనివారం విస్తృతంగా ఆ వార్త చక్కర్లు కొట్టింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రతినిధులు స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి చేరేది లేదంటూ అవన్నీ తప్పుడు కథనాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.