Krishna

News March 19, 2024

NTR: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు గమనిక

image

ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ట్రైన్ నెం.22701 విశాఖపట్నం- గుంటూరు, నెం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌లను ఏప్రిల్ 1 నుంచి 28 వరకూ రద్దు చేస్తున్నట్లు, రైల్వే వర్గాలు తాజాగా పేర్కొన్నాయి.

News March 19, 2024

నందిగామ: ఘనంగా నూతన కోర్టు భవనాలు ప్రారంభం

image

నందిగామలోని కోర్టు కాంప్లెక్స్ లో నూతన సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, అడిషనల్ జూనియర్ జడ్జి కోర్టు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ఎన్టీఆర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ శేష సాయి, హైకోర్టు జడ్జిలు కృపాసాగర్, గోపాలకృష్ణ మండేల పాల్గొని ప్రారంభించారు.

News March 19, 2024

కృష్ణా: APSDMA అధికారుల ముఖ్య విజ్ఞప్తి

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండవద్దని ఆయన సూచించారు. పిడుగులు పడే సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.

News March 19, 2024

నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: కలెక్టర్

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్  రాజాబాబు పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

News March 19, 2024

కృష్ణా: బీటెక్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

కృష్ణా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో చదువుతున్న బీటెక్ విద్యార్థులు హాజరు కావాల్సిన 8వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) ప్రాక్టికల్/ వైవా పరీక్షలను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మార్చి 25వ తేదీలోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. ఫీజు వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలన్నాయి.

News March 19, 2024

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ?

image

అవనిగడ్డ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధ పోటీ చేస్తారన్న ప్రచారం జిల్లాలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించగా, అక్కడ బొండా ఉమాకు అవకాశం దక్కింది. దీంతో జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి నాదెండ్ల మనోహర్‌ని రాధ కలవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

News March 19, 2024

ఇబ్రహీంపట్నంలో మహిళ మృతదేహం లభ్యం

image

ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం దాములూరు గ్రామం డొంక రోడ్డులో సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు వయసు గలిగిన మహిళ మృతదేహం ఉందని, స్థానికులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2024

బాపట్ల వద్ద రైలు కిందపడి విజయవాడ వాసి మృతి

image

బాపట్లలో సోమవారం సాయంత్రం రైలు కిందపడి మృతి చెందిన వ్యక్తి వివరాలను రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ఎస్సై రాజకుమార్ తెలిపిన కథనం మేరకు.. విజయవాడకు చెందిన షేక్. సమ్మర్ (45) అనే వ్యక్తి రైలులో కాంట్రాక్ట్ పద్ధతిలో సమోసాలు విక్రయిస్తుంటాడు. సోమవారం సాయంత్రం పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్ బాపట్లలో నిలపగా.. కాలకృత్యాలు తీర్చుకుని రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా జారిపడి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News March 19, 2024

MTM: చెత్త కుప్పలో హౌస్ ఫైల్.. విచారణకు ఆదేశించిన కలెక్టర్

image

మచిలీపట్నంలో జర్నలిస్టుల హౌస్ సైట్స్‌కు సంబంధించిన, తీర్మాన ఫైల్ చెత్త<<12882516>> కుప్పలో దర్శనమివ్వడంపై<<>> జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ని ఆదేశించారు. నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఫైల్ ఆన్‌లైన్‌లో బాగ్రత్తగా ఉంటుందని.. ఈ విషయంలో జర్నలిస్టులెవ్వరూ ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ భరోసానిచ్చారు.

News March 19, 2024

నాగాయలంక కృష్ణా తీరంలో జెల్లీ ఫిష్‌ల సందడి

image

కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద కృష్ణా నదిలో పెద్ద సంఖ్యలో జెల్లీ ఫిష్‌లు సందడి చేస్తున్నాయి. సముద్రపు జలాలు కృష్ణా నది బ్యాక్ వాటర్‌గా ప్రవహించే ఈ ప్రాంతంలోకి సముద్రపు జీవులైన జెల్లీ ఫిష్‌లు వేసవిలో వస్తుంటాయి. ఈసారి కూడా జెల్లీ ఫిష్‌లు నాగాయలంక తీరానికి రావటంతో సందర్శకులు అక్కడికి చేరుకుని తిలకిస్తున్నారు. పుష్కర ఘాట్ అవతలి లంకదిబ్బల మధ్య జలాల్లో ఫిష్‌లు అత్యధికంగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు.

error: Content is protected !!