India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్టీఆర్ జిల్లాలోని ఎ కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. విజయవాడ- తిరువూరు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కైకలూరులో శనివారం నిర్వహిస్తున్న సిద్ధం సభకు సీఎం జగన్ మధ్యాహ్నం హెలికాప్టర్లో చేరుకొన్నారు.
భాష్యం స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో ఆయనకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ స్వాగతం పలికారు. జగన్‌ని చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. తీన్మార్ డప్పులు, కళాకారులు చేసిన నృత్యాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

మరి కాసేపట్లలో సీఎం జగన్ కైకలూరుకి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ చివరి రోజు కైకలూరులో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సీఎం జగన్ కోసం ఎదురు చూస్తున్నాయి. సీఎం జగన్ రాకతో నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

మండలంలోని వేల్పూర్ లో పెద్ద మొత్తంలో తరలిస్తున్న మద్యం వాహనాన్ని ఎస్ఈబి అధికారులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. సీఐ వెంకటలక్ష్మి, ఎస్సైలు దుర్గాప్రసాదరావు, సుబ్బారావు మద్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. వారు మాట్లాడతూ. రూ.11.50లక్షల విలువగల 5,937 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని చెప్పారు.

అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల మేరకు కంకిపాడు పులిరామారావు వీధికి చెందిన శ్రావ్య ఐదు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోందన్నారు. ఎన్ని మందులు వాడిన ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

విజయవాడ పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న అన్నదమ్ముల పోటిపై ఆసక్తి నెలకొంది. వైసీపీ నుంచి కేశినేని నాని, టీడీపీ నుంచి నాని తమ్ముడు కేశినేని చిన్ని బరిలోకి దిగుతున్నారు. 2014, 19లో టీడీపీ నుంచి గెలుపును సొంతం చేసుకున్న నాని ఈ సారి పార్టీ మారి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిన్ని, నాని హ్యాట్రిక్‌ను అడ్డుకుంటారా, మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

మే 13న జరిగే ఎన్నికల నేపథ్యంలో దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ స్వస్థలాలకు చేరుకొంటున్నారు. ఉద్యోగ, వ్యాపారరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఉత్సాహంగా తమ ఊర్లకి తరలివస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చే వారు అధికంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే బస్సు సర్వీసులన్ని కిటకిటలాడుతున్నాయి. దీంతో అధికారులు అదనంగా 225 బస్సులను నడుపుతున్నారు.

మరికొన్ని గంటల్లో కృష్ణా జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. విజయవాడ తూర్పులో ఓటుకు రూ.1,500, సెంట్రల్‌లో రూ.2వేలు, నందిగామ, జగ్గయ్యపేటల్లో పరిస్థితిని బట్టి రూ.1500 నుంచి రూ.2వేలు, గుడివాడ, పెనమలూరులో రూ.2వేలు పంచుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. రెండోసారి పంపిణీకి సిద్ధమవుతున్నారు.

విజయవాడలోని ఓ కళాశాలలో చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో తానికొండ పవన్ అనే యువకుడికి న్యాయస్థానం శుక్రవారం 10ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. సదరు బాలిక(16)ను 2016లో నిందితుడు పవన్(19) అత్యాచారం చేయగా సూర్యారావుపేట PSలో కేసు నమోదు కాగా, కేసు విచారించిన పోక్సో కోర్ట్ జడ్జి తిరుమల వెంకటేశ్వర్లు శుక్రవారం నిందితుడు పవన్‌కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్ సజావుగా జరిగేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, వీఆర్వోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలింగ్ సజావుగా జరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.