Krishna

News March 23, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైంటేబుల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని డిగ్రీ(2019- 20 బ్యాచ్) విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 20 వరకు ఈ పరీక్షలు ఆయా తేదీల్లో జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షల టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News March 22, 2024

జిల్లాలో పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

image

పది పరీక్షల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా తెలిపారు. జిల్లాలో మొత్తం 151 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా గణితం పరీక్షకు 21,539 మంది విద్యార్థులకు గానూ 391 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 30 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని డీఈఓ తెలిపారు.

News March 22, 2024

కృష్ణా: టీడీపీ నుంచి.. నాడు తండ్రి, నేడు కుమారుడు

image

మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు 1972లో కాంగ్రెస్, 1983, 85లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కృష్ణప్రసాద్ 2019(మైలవరం)లో వైసీపీ తరఫున గెలిచారు. తాజాగా ఆయన టీడీపీ నుంచి బరిలో దిగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వసంత మరోసారి గెలిస్తే రెండు వేర్వేరు పార్టీల తరఫున విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకుమారులుగా రికార్డెలకెక్కనున్నారు.

News March 22, 2024

విజయవాడలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

image

విజయవాడలో శుక్రవారం భారీగా నగదు, బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ వద్ద రెండు కేజీల బంగారం, కిలోన్నర వెండి, కోటిన్నర నగదు పట్టుబడింది.ఎన్నికల నిబంధన మేరకు ఒక మనిషి రూ.50,000 మాత్రమే తీసుకొని వెళ్లాల్సి ఉంది. ఇది నగరంలోని ఓ బంగారు షాపుకు చెందినదిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు.

News March 22, 2024

ఫిర్యాదుల ప‌రిష్కార నాణ్య‌త‌పై దృష్టిసారించాలి: కలెక్టర్

image

ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాట్లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు తెలిపారు. సీ-విజిల్‌, 1950 హెల్ప్‌లైన్‌, నేష‌న‌ల్ గ్రీవెన్స్ స‌ర్వీస్ పోర్ట‌ల్ (ఎన్‌జీఎస్‌పీ), క‌లెక్ట‌రేట్ కంట్రోల్ రూం నెంబ‌ర్ (0866-2570051) త‌దిత‌రాల ద్వారా వ‌చ్చే ఫిర్యాదుల‌ను నాణ్య‌త‌తో, స‌త్వ‌ర ప‌రిష్కారంపై దృష్టిసారించాల‌ని అధికారులకు సూచించారు.

News March 22, 2024

దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్‌పై సందిగ్ధత

image

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాజకీయ భవిష్యత్త్‌పై సందిగ్ధత నెలకొంది. నేడు ప్రకటించిన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంటుందని అభిమానులు, కార్యకర్తలు ఆశగా ఎదురు చూశారు. కానీ ఉమా పేరు లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు సీటు లేకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళన చేస్తున్నారు.

News March 22, 2024

విజయవాడ: సివిల్ సర్వీసెస్‌లో మహేశ్‌కు కాంస్య పతకం

image

న్యూ ఢిల్లీలో 18 నుంచి 22 వరకు జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో సిహెచ్. మహేశ్ కాంస్య పతకం సాధించాడు. మహేశ్ విజయవాడలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పవర్ లిఫ్టింగ్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సిబ్బంది, సహచరులు అభినందించారు.

News March 22, 2024

చింతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగ్గయ్యపేట వాసి మృతి

image

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో జగ్గయ్యపేటకు చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించామని చెప్పారు.

News March 22, 2024

విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ

image

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. అటు వైసీపీ నుంచి కేశినేని నాని బరిలోకి దిగుతుండగా.. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తి నెలకొంది. కాగా 2022లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్ని తొలిసారి పోటీచేస్తున్నారు. అటు గత ఎన్నికలో టీడీపీ తరఫున పోటీచేసి నెగ్గిన నాని ఈసారి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలో విజయవాడలో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

గుడ్లవల్లేరులో టీడీపీ కార్యాలయంపై దాడి

image

గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామ టీడీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గురువారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ కార్యాలయ తలుపులు పగుల గొట్టి, కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!