India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కృష్ణా జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఈ కింది హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.
జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెంబర్లు :
పోలీస్ – 9030442275
మెడికల్ – 9705351134
ఆర్టీసీ – 9440449840
ఎమర్జెన్సీ సర్వీసెస్ – 8106653305
ఇతర అన్ని శాఖలు – 9494934282

సినీ నటుడు నారా రోహిత్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం ఆయన నందిగామ, సాయంత్రం పామర్రులో పర్యటించనున్నట్లు ఆపార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి అభ్యర్థులు తంగిరాల సౌమ్య, వర్ల కుమార్ రాజా విజయాన్ని కాంక్షిస్తూ నారా రోహిత్ ప్రచారం చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు.

కృష్ణాజిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ తుది దశకు వచ్చింది. ఈ నెల 2వ తేదీన హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా 1762 మంది వృద్ధులు, దివ్యాంగులకు గానూ ఇప్పటి వరకు 1630 మంది హోమ్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. గన్నవరంలో 271, గుడివాడలో 154, పెడనలో 117, మచిలీపట్నంలో 191, అవనిగడ్డలో 322, పామర్రులో 219, పెనమలూరులో 356 మంది హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.

తిరువూరు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో, అదే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్థానికులు చెబుతుంటారు. నియోజకవర్గం ఆవిర్భంచిన నాటి నుంచి ఒక్కసారి మినహా ఇలాగే జరగడం విశేషం. 1967లో తిరువూరును ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2014లో మాత్రం ఇక్కడ వైసీపీ గెలవగా, ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలవగా, ఆ పార్టీనే అధికారం చేపట్టిన విషయం తెలిసిందే.

గన్నవరం విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మోదీ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళతారన్నారు. నగరంలో రోడ్ షో అనంతరం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని చెప్పారు.

మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో సినీ నటుడు నారా రోహిత్ రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముందుగా మోడ్రన్ సూపర్ మార్కెట్ నుంచి ప్రచారం ప్రారంభమవుతుందని మెయిన్ సెంటర్ స్ట్రీట్ కార్నర్లో మీటింగ్ ఉంటుందని పార్టీ వర్గాలు ప్రకటనలో తెలిపాయి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.

సీఎంగన్ ఈ నెల 6వ తేదీన మచిలీపట్నం రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు కోనేరుసెంటర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాయి.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో భార్యాభర్తలు MLAలుగా గెలిచి చరిత్ర సృష్టించారు. ముక్తాల గ్రమానికి చెందిన వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వరప్రసాద్ అప్పటి ఎన్నికలో స్వంతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్‌పై MLAగా గెలుపొందారు. 1974లో అయన మరణానంతరం భార్య రాజ్యలక్ష్మమ్మ కాంగ్రెస్‌లో చేరి MLAగా గెలిచి 4ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్యాభర్తలు MLAగా గెలిచిన ఘనత అప్పట్లో జగ్గయ్యపేటకే దక్కింది.

క్రికెట్ బెట్టింగ్‌లో పెద్ద మొత్తంలో డబ్బులు పొగొట్టుకున్నందుకు తల్లిదండ్రులు క్రికెట్ బెట్టింగ్‌లు ఆడవద్దని మందలించినందుకు మనస్థాపం చెంది రాణిగారితోటకు చెందిన మేకల చంద్రశేఖర్(30) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రశేఖర్ వ్యసనాలకు బానిసై పలువురు వద్ద అప్పులు చేశాడు. తల్లిదండ్రులు మందలించారు మనస్థాపంతో శనివారం సాయంత్రం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు.

కృష్ణా జిల్లాలో తొలి రోజు 3361 మంది పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 3,728 మందికి గానూ సాయంత్రం 5 గంటలకు వరకు అందిన సమాచారం మేరకు 3,361 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. గన్నవరంలో 299, గుడివాడలో 490, పెడనలో 212, మచిలీపట్నంలో 783, అవనిగడ్డలో 843, పామర్రులో 246, పెనమలూరులో 488 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు.
Sorry, no posts matched your criteria.