Krishna

News March 19, 2024

MTM: చెత్త కుప్పలో హౌస్ ఫైల్.. విచారణకు ఆదేశించిన కలెక్టర్

image

మచిలీపట్నంలో జర్నలిస్టుల హౌస్ సైట్స్‌కు సంబంధించిన, తీర్మాన ఫైల్ చెత్త<<12882516>> కుప్పలో దర్శనమివ్వడంపై<<>> జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ని ఆదేశించారు. నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఫైల్ ఆన్‌లైన్‌లో బాగ్రత్తగా ఉంటుందని.. ఈ విషయంలో జర్నలిస్టులెవ్వరూ ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ భరోసానిచ్చారు.

News March 19, 2024

నాగాయలంక కృష్ణా తీరంలో జెల్లీ ఫిష్‌ల సందడి

image

కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద కృష్ణా నదిలో పెద్ద సంఖ్యలో జెల్లీ ఫిష్‌లు సందడి చేస్తున్నాయి. సముద్రపు జలాలు కృష్ణా నది బ్యాక్ వాటర్‌గా ప్రవహించే ఈ ప్రాంతంలోకి సముద్రపు జీవులైన జెల్లీ ఫిష్‌లు వేసవిలో వస్తుంటాయి. ఈసారి కూడా జెల్లీ ఫిష్‌లు నాగాయలంక తీరానికి రావటంతో సందర్శకులు అక్కడికి చేరుకుని తిలకిస్తున్నారు. పుష్కర ఘాట్ అవతలి లంకదిబ్బల మధ్య జలాల్లో ఫిష్‌లు అత్యధికంగా ఉన్నాయని సందర్శకులు తెలిపారు.

News March 19, 2024

కృష్ణా: చేపల చెరువులో విషప్రయోగం

image

బంటుమిల్లి మండలం రామవరపు మోడిలోని 3 ఎకరాల చేపల చెరువులో విషప్రయోగం కలకలం రేపుతోంది. బాధితుల వివరాల ప్రకారం.. గూడవల్లి లక్ష్మీ చేపల సాగు చేస్తున్నామన్నారు. కుమార్తె వివాహం కోసం నాలుగు రోజుల్లో చేపలు పట్టడానికి బేరం కుదుర్చుకున్నామని, ఈలోపే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతో చేపలన్నీ చనిపోయాయని.. దాదాపు రూ. 7 లక్షల నష్టం జరిగిపట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

పెనమలూరు తెరపైకి కొత్త పేర్లు..?

image

కృష్ణా జిల్లా పెనమలూరు టికెట్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే బోడే ప్రసాద్‌కు టికెట్ ఇవ్వలేకపోతున్నామని అధినేత చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడంతో రోజురోజుకి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. పెనమలూరు తెరపైకి తాజాగా టీడీపీ నేత ఆలపాటి రాజా, దేవినేని చందు పేర్లు అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్ కేటాయిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది.

News March 19, 2024

విజయవాడ: కామాంధుడికి కఠిన శిక్ష విధించిన పోక్సో కోర్ట్

image

విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నకూతురిని గర్భవతిని చేసిన కామాంధుడికి (36) సోమవారం పోక్సో కోర్టు జీవితకాల శిక్ష విధించింది. నిందితుడిపై గత ఏడాది జులై 2న కుమార్తెపై(15) అత్యాచారం చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు విచారించిన పోక్సో కోర్టు జడ్జి ఎస్. రజిని నిందితుడికి జైలు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీకి ఆదేశాలిచ్చారు.

News March 19, 2024

కృష్ణా: యువతకు ముఖ్య గమనిక

image

సైబర్ భద్రతపై యువతీ యువకులకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో జరిగే ఈ శిక్షణకు ఆసక్తి కలిగిన వారు https://skilluniverse.apssdc.in/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని APSSDC అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 18, 2024

కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

వేసవి సమీపించిన నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు సోమవారం మండల, గ్రామ స్థాయి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుంచి గ్రామీణ నీటి సరఫరా(RWS) అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఆయన RWS అధికారులకు ఆదేశాలిచ్చారు.

News March 18, 2024

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ దర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు

image

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనం కోసం రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. నిన్న, ఇవాళ కలిపి 2.30 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నూతన వధూవరులు, పరీక్షలు పూర్తయిన ఇంటర్ విద్యార్థులు, పరీక్షలకు సిద్ధమైన పదో తరగతి విద్యార్థులతో పాటు సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. రెండ్రోజుల్లో రూ.17 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News March 18, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు వర్ష సూచన

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ఈ నెల 20వ తేదీన వర్షం పడే అవకాశముందని ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(APSDMA) అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశముంటుందని తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News March 18, 2024

కృష్ణా: BSP తొలి అభ్యర్థుల జాబితా విడుదల

image

బహుజన సమాజ్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.. విజయవాడ హనుమాన్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసే తమ 11 మంది లోక్ సభ, 50 మంది శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాను రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పరం జ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణ చంద్రరావు విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు.

error: Content is protected !!