Krishna

News April 5, 2024

విజయవాడ: పింఛన్ సొమ్ముతో సచివాలయం ఉద్యోగి పరార్

image

విజయవాడలో పింఛను డబ్బుతో సచివాలయ ఉద్యోగి పరారైన ఘటన శుక్రవారం జరిగింది.మధురానగర్ సచివాలయం-208కి చెందిన ఉద్యోగి నాగమల్లేశ్వరావుగా అధికారులు గుర్తించారు. సచివాలయంలో పింఛను పంపిణీ సొమ్ములో తేడా రావడంతో విషయం వెలుగుచూసింది. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News April 5, 2024

కృష్ణా: ఎం-ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఎం-ఫార్మసీ విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 24, 26, 29, మే 1వ తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల టైం టేబుల్, పరీక్ష కేంద్రాల పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

News April 5, 2024

విజయవాడ :పానీపూరీ లేదన్నందుకు దాడి..కేసు నమోదు

image

పానీపూరీ వ్యాపారిపై దాడి చేసిన యువకుడిపై సింగ్ నగర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గంభీర్ బాలకుమార్ పీ అండ్ టీ కాలనీలో నివసిస్తూ స్థానికంగా పానీపూరీ బండి నడుపుతున్నాడు. బాలకుమార్ గురువారం వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వర్ధన్ అనే యువకుడు తనకు పానీపూరీ కావాలని అడిగాడు. సమయం అయిపోయిందని ఇంటికి వెళుతున్న పానీపూరీ లేదని చెప్పడంతో దాడి చేసి గాయపర్చాడని పోలీసులు తెలిపారు.

News April 5, 2024

విజయవాడ: రాజీనామా చేసి టీడీపీలో చేరిన వాలంటీర్లు

image

విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామానికి చెందిన ఆరుగురు వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబాపురం సర్పంచి గండికోట సీతయ్య, మాజీ ఎంపీపీ తోడేటి రూబేను ఆధ్వర్యంలో వాలంటీర్లతో పాటు పలువురు టీడీపీలో చేరారు.

News April 4, 2024

విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు వన్ వే స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ మేరకు నేడు గురువారం విజయవాడ మీదుగా బరౌని- కోయంబత్తూరు (నెం.05279) మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్ ఈ రోజు రాత్రి 23.42 గంటలకు బరౌనిలో బయలుదేరి ఆదివారం ఉదయం 4 గంటలకు కోయంబత్తూరు చేరుకుంటుందని పేర్కొంది. ఏపీలో ఈ ట్రైన్ విజయవాడతో పాటు దువ్వాడ, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది.

News April 4, 2024

కృష్ణా: ప్రజలకు ముఖ్య గమనిక

image

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) జిల్లాలో గురువారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు(డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో) నమోదవుతాయని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
☞కంకిపాడు 40.4
☞ఉయ్యూరు 39.9
☞బాపులపాడు 40.6
☞గుడివాడ 39.5
☞గన్నవరం 40.7
☞పెనమలూరు 40.7
☞ఉంగుటూరు 40.4
☞పెదపారుపూడి 39.9
☞తోట్లవల్లూరు 39.9
☞పామర్రు 39.1

News April 4, 2024

కోడూరు: కృష్ణా నదిలో దూకి యువకుడి ఆత్మహత్య..!

image

కృష్ణా నదిలో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోడూరు మండల పరిధిలోని ఉల్లిపాలెం భవానీపురం వారధి చోటు చేసుకుంది. అవనిగడ్డ సీఐ త్రినాథ్ తెలిపిన వివరాల మేరకు గుడివాడకు చెందిన చిన్న శంకర్రావు(33) అనే యువకుడు బుధవారం రాత్రి ఉల్లిపాలెం వారిధి వద్ద తన యొక్క వాహనాన్ని వదిలి కృష్ణా నదిలో దూకినట్లు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా గురువారం మృతదేహం లభ్యం అయిందని తెలిపారు.

News April 4, 2024

ఎన్టీఆర్: తొలిసారి పోటీకి దూరంగా దేవినేని

image

సోదరుడు రమణ మరణానంతరం 1999 నుంచి ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దేవినేని ఉమ ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 1999, 2004లో నందిగామలో గెలిచిన ఉమ ఆ స్థానం ఎస్సీలకు రిజర్వ్ కావడంతో 2009,14,19లో మైలవరంలో పోటీ చేశారు. 2019లో మినహా ఆయన ప్రతిసారి గెలుపు సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికలలో టీడీపీ అధిష్ఠానం మైలవరం టికెట్ వసంతకు కేటాయించడంతో ఉమ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.

News April 4, 2024

కృష్ణా: కలెక్టర్‌గా డీకే బాలాజీ నియామకం

image

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డీకే బాలాజీని కృష్ణా జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం రాత్రి 8 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా విధుల్లో ఉన్న రాజబాబుపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

News April 4, 2024

మచిలీపట్నం: 10వ తేదితో ముగియనున్న అడ్మిషన్ల గడువు

image

మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయలో 2024-25 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ మొహమ్మద్ ఆసిఫ్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్‌లో https://machhlipatnam.kvs.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 1వ తరగతిలో అడ్మిషన్లకై ఆరేళ్ల వయస్సున్న విద్యార్థులు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.