Krishna

News March 17, 2024

గొల్లపల్లిలో ఒడిశాకు చెందిన యువతి మృతి

image

నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 17 సంవత్సరాల యువతి ఆదివారం అనుమానాస్పదంగా మృతిచెందింది. ఫ్యాను హుక్‌కి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 17, 2024

గుడివాడ: జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అభ్యర్థిగా హేమంత్

image

రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలని, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కోరారు. ఆదివారం గుడివాడకు చెందిన న్యాయవాది అల్లూరి హేమంత్ కుమార్‌ను గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లోకి యువత రావడం ఎంతో అవసరం అన్నారు. జిల్లా కో-ఆర్డినేట‌ర్ బి.స‌త్య వ‌సుంధ‌ర‌, లీగ‌ల్ సెల్ ప్రెసిడెంట్ నాయ‌ర్, పాల్గొన్నారు.

News March 17, 2024

మాజీ ఎమ్మెల్యే ముద్ర బోయిన ప్రయాణం ఎటు?

image

ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ముద్ర బోయిన వెంకటేశ్వరరావు ప్రయాణమెటని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. రాజ్యసభ సభ్యులు వై. వి. సుబ్బారెడ్డిని కలిసిన ముద్రబోయిన, నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సీటు వస్తుందని నియోజకవర్గంలోని ముద్ర బోయిన ఆత్మీయులు భావించారు. కానీ శనివారం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పారావు పేరును ప్రకటించారు.

News March 17, 2024

ఉమ్మడి కృష్ణాలో సిట్టింగ్‌ల వైపు మొగ్గు చూపిన జగన్

image

ఉమ్మడి కృష్ణాలో సిట్టింగ్ MLAలు సింహాద్రి రమేష్ (అవనిగడ్డ), వల్లభనేని వంశీ (గన్నవరం), కొడాలి నాని (గుడివాడ), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), కైలే అనిల్ (పామర్రు), మొండితోక జగన్మోహనరావు (నందిగామ), మేకా ప్రతాప్ అప్పారావు (నూజివీడు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట)లకు వారి స్థానాల్లో పోటీ చేస్తుండగా పెడన MLA జోగి రమేశ్ పెనమలూరు, విజయవాడ పశ్చిమ MLA వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్‌లో పోటీ చేస్తున్నారు.

News March 17, 2024

అవనిగడ్డ కూటమి టికెట్ ఎవరికి దక్కునో?

image

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు నేపథ్యంలో కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సీటు ఎవరికి దక్కుతుందనే సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. టీడీపీ తరఫున ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి,మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. జనసేన తరఫున మత్తి వెంకటేశ్వరరావు, మాదివాడ వెంకట కృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 17, 2024

ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల: కలెక్టర్ ఢిల్లీరావు

image

ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా నేడు జారీచేసిన షెడ్యూల్ ప్రకారం 2024 సాధారణ ఎన్నికల 4వ దశలో జిల్లాలోని విజ‌య‌వాడ పార్ల‌మెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు శనివారం తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 

News March 16, 2024

కట్టుదిట్టంగా పదో తరగతి పరీక్షలు: కలెక్టర్

image

ఈ నెల 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్ధానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో వివిధ శాఖల సిబ్బందితో పదో తరగతి పరీక్షలు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

error: Content is protected !!