Krishna

News September 28, 2024

భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తిచేస్తాం: కలెక్టర్

image

ఈ నెలాఖరులోగా ఫ్రీహోల్డ్ భూముల రికార్డుల పరిశీలన కార్యక్రమం పూర్తి చేస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. శనివారం సీసీఎల్ఏ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి అమరావతి నుంచి జిల్లా కలెక్టర్లతో ఫ్రీ హోల్డ్ భూములపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మార్వోల స్థాయిలో 682 ఎకరాల ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల పరిశీలన పూర్తయిందని చెప్పారు.

News September 28, 2024

‘ఆర్థిక ఉత్పత్తుల విలువ 15% పెరిగే విధంగా విజనరీ డాక్యుమెంట్’

image

జిల్లాలో అన్ని రకాల ఆర్థిక ఉత్పత్తుల విలువ 15% పెరిగే విధంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ పత్రాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్పీ కన్వెన్షన్ హాలులో కలెక్టర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ పత్రం తయారీపై వివిధ వర్గాల వాటాదారులతో శనివారం కార్యశాల నిర్వహించారు.

News September 28, 2024

పింఛన్ల పంపిణీ సజావుగా జరగాలి: కలెక్టర్

image

అక్టోబర్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పింఛన్లను సజావుగా పంపిణీ చేసేందుకు ముందు రోజు వారి పరిధిలోని సచివాలయంలో తప్పనిసరిగా ఉండాలన్నారు. వారి పరిధిలోని లబ్ధిదారుల జాబితా ప్రకారం రూట్ మ్యాప్‌ను రూపొందించుకొని ప్రణాళికబద్ధంగా పంపిణీ చేపట్టాలన్నారు.

News September 28, 2024

కలెక్టర్ బాలాజీను కలసిన RDO బాలసుబ్రమణ్యం

image

కలెక్టర్ DK బాలాజీని గుడివాడ RDO జి.బాలసుబ్రమణ్యం శనివారం కలిశారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఛాంబర్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ RDO బాలసుబ్రమణ్యంకు పలు సూచనలు చేశారు. అనంతరం RDO తన కార్యాలయానికి చేరుకొని పదివి బాధ్యతలు స్వీకరించారు.

News September 28, 2024

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ చేసిన కలెక్టర్‌ సృజన

image

గొల్లపూడి మార్కెట్‌ యార్డ్‌లోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్‌ను కలెక్టర్‌ జి.సృజన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈవీఎంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్‌ గోడౌన్‌‌కు వేసిన సీల్‌లు, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్‌ సంతకం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

News September 28, 2024

MLA కొలికపూడి కీలక వ్యాఖ్యలు

image

తిరువూరు MLA సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ఓ పోస్టు తెగ వైరలైవతోంది. ‘అగ్ని పర్వతం బద్దలయ్య ముందు.. భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అని పోస్టు చేశారు. దీంతో ఆయన దేని గురించి ఆ వ్యాఖ్యలు చేసినట్టా అని ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు.

News September 28, 2024

నేడు విజయవాడకు రానున్న శ్రీలీల

image

నేడు విజయవాడకు ప్రముఖ సినీ నటి శ్రీలీల రానున్నారు. ఎంజీ రోడ్డులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు గడ్డే రామ్మోహన్, బోండా ఉమాహేశ్వరరావు, సుజనా చౌదరి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కూడా హాజరుకానున్నారని సమాచారం.

News September 28, 2024

కృష్ణా: గృహ నిర్మాణ లబ్ధిదారులతో అవగాహన సదస్సులు

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించి గృహ నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుండి గృహ నిర్మాణంపై క్షేత్రాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 28న జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లలోనూ, కమ్యూనిటీ హాళ్లలోనూ గృహ నిర్మాణాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.

News September 27, 2024

కృష్ణా: సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున వర్శిటీ పరిధిలోని కాలేజీలలో బీ-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3, 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల(సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుండి 30 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడవచ్చంది.

News September 27, 2024

కృష్ణా: ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడి మృతి

image

కృష్ణా జిల్లా తాడిగడపలో బస్సును ఓవర్టేక్ చేయబోయి స్కిడ్ అయ్యి పడటంతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు తాడిగడపకు చెందిన అశోక్(23)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.