India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికలకు పనిచేసిన బిఎల్వోలకు వేతన బకాయిలు చెల్లించాలని తహశీల్దార్‌లకు కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. 4,053 BLOలకు రూ.91,19,250 వేతన బకాయిలు చెల్లించాలన్నారు. ఉయ్యూరుకు చెందిన యునైటెడ్ ఫారం ఫర్ యూఎఫ్ ఆర్‌టీఐ రాష్ట్ర కోకన్వీనర్ జంపాన శ్రీనివాస్ గతంలో కలెక్టర్‌ని కోరారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధైన సమాచార శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది సేవలు అత్యంత కీలకమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సుదీర్ఘకాలం సమాచార శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి డివిజనల్ పీఆర్‌వోగా పదవీ విరమణ చేసిన సుంకర శ్రీనివాసరావు దంపతులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. తొలుత స్థానిక విజయశ్రీ కన్వెన్షన్‌లో శ్రీనివాసరావు పదవీవిరమణ సభ జరిగింది.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 11, 13, 15, 18వ తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తట్టుకోలేక గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామానికి చెందిన రావి సత్తిబాబు (35) అనే ఆటో డ్రైవర్ ఉరి వేసుకొని చనిపోయాడు. గుడివాడలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.7.80 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతినెల 5వ తేదీ వాయిదా చెల్లించవలసి ఉండగా ఈ నెల 25న ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది ఒత్తిడి చేశారని, ఇంటికి వచ్చి అల్లరి చేశారని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన రూ.1.60 కోట్లు విలువ చేసే గోల్డ్‌ను రోల్డ్ గోల్డ్ పెట్టి మోసం చేస్తున్న బ్యాంకు ఉద్యోగిపై కేసు నమోదయింది. మచిలీపట్నం పోలీసులు కథనం.. పట్టణంలో ఓ బ్యాంకు ఉద్యోగి సోమశేఖర్ కస్టమర్స్ బ్యాంకులో పెట్టిన గోల్డ్ ప్లేస్‌లో రోల్డ్ గోల్డ్ పెట్టి ఆ గోల్డ్‌ను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చేపట్టారు.
కృష్ణా యూనివర్సిటీలో బీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ఈఏపీసెట్-2025 రాయని విద్యార్థులకు సైతం ఫిబ్రవరి 3న నిర్వహించే స్పాట్ అడ్మిషన్‌లో ప్రవేశాలు కల్పిస్తామని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. స్పాట్ అడ్మిషన్ ఫీజు తదితర వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించాయి.
కృష్ణా జిల్లా పరిషత్‌కు అరుదైన గౌరవం లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది వివిధ విభాగాల్లో అవార్డ్స్‌ను అందజేస్తుంది. 2023కి పంచాయతీ విభాగంలో సబ్ క్యాటగిరీ కింద కృష్ణా జిల్లా పరిషత్‌ను ఎంపిక చేశారు. ఢిల్లీలో వచ్చే నెల ఒకటో తేదీన ఈ అవార్డ్ అందిస్తారని ZP. CEO కన్నమ నాయుడు చెప్పారు. పరిషత్ సభ్యులు అధికారుల సహకారంతోనే అవార్డు వచ్చిందని జెడ్పీ చైర్‌పర్సన్ హారిక అన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే బాలాజీ అన్నారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై ఆయన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి ఎన్నికల నియమ నిబంధనలు వివరించారు.
మహాత్మగాంధీ కలలుగన్న ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ డీ.కే బాలాజీ అన్నారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో మహాత్మగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు.
జిల్లాలోని పీహెచ్సీలలో మెరుగైన వైద్య సేవలు అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. పీహెచ్సీలలో వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన, సమస్యలపై బుధవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యాధికారులు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు.
Sorry, no posts matched your criteria.